Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వాయిదా ! వాయిదా !
సభలు వాయిదా
ప్రజల సమస్యల పరిష్కారమూ వాయిదా !
సభ అంటే జనం ఇబ్బందులు
తమ నాయకుల ద్వారా గొంతు విప్పుకోవడమే కదా
సత్వర లోక ప్రయోజనంగా!
వ్యక్తిగత పార్టీ వివాదాలతో నినాదాలతో
సభలకు ఎప్పుడూ గండమే !!
ప్రగతి పైన బండ పడ్డట్టే
గతి తప్పిన ప్రజాస్వామ్య సభలు
జనానికి ఐదేళ్ల వరకూ నిరీక్షణే
ఎన్నికలు ఎండమావులు !
పంచ వర్ష ప్రణాళికలు ఉద్గ్రంథాలు !
గెలిచిన నాయకులకు రోజూ పండగే !
దేశ స్పృహ లేదు !
ప్రజల పొడ గిట్టదు !
అదిగో ! సభలు మళ్లీ వాయిదా
ప్రజలు గారడి చూస్తున్నారా !!
- కందాళైరాఘవాచార్య,
8790593638