Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మాకు ''సెంటు'' కొట్టుకునుడు ఎర్కలే.....
పల్లంల ''అంటు'' లేకుండ ఊడ్సుకొని
తినుడే తెల్సు...
శిన్న రోగానికే మీ పానం సిత్తుబొత్తయ్యతే...
''పేదరికం'' అనే రోగాన్ని మేము
ఇంటి పేరు మోసినట్లే మోత్తన్నం....
కడుపే మా గల్లగురిగి...
నాలుగు మెతుకులు లోపల వడ్తతనే ...
కట్టంజేస్కొని కంటి నిండా నిద్రవోతం....
మా ఇండ్లు ఇర్కుంటయేమో కానీ..
మా గుణానికి మర్కలేదు...
మాటవడం, మందిని ముంచం..
ఎండకాలమచ్చిందని నీడకుండం....
ఆనకాలనచ్చిందని ఇంట్లవండం....
అల్మరాల దాస్కొన్ని నోట్లుంకపోవచ్చని...
ఎదురుగున్న దిగుట్ల సిల్లర పైసలైతే
ఎప్పుడు నవ్వుతనే ఉంటవ్...
మా లోతు బతుకుల్ని తోడిన కొద్ది
సెమట సుక్కలే పడ్తన్నయని ....
మా కలల కుప్ప కాలికి తాకే రోజత్తలేదు....
అట్లని మాయి సెల్లని బతుకులనుకునేరు....
పేదరికాన్ని దున్నే రైతులం
పచ్చవడే దాన్క కట్టపడ్తనే ఉంటం...
సుఖం మా తలాపుకు పెట్టుకొని పండే రోజు
దుఃఖాన్ని నెమరేసుకుంట నిద్రవోతం....
మేము పేదరికపు పందిరి కింద
నిత్య విద్యార్థులమే కావచ్చు...
కానీ పాఠాలు కొత్తయే...
- తుమ్మల కల్పన రెడ్డి, 9640462142