Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లె పల్లెన పాదయాత్ర ప్రజల పోరుయాత్ర-
ఇది ప్రజాస్వామ్య యాత్ర
సర్కారు తీరుపైన సాగే దండయాత్ర-
ఇది సమరశీల యాత్ర ? పల్లె పల్లెన?
సమస్యల బురుజు మీద సైరన్ మోత
అది సాగిపొమ్మంది
కోకిలమ్మ కొత్తగొంతు పాట పాడింది
అది పోరు చూపింది
పోరుతప్ప బతుకు దారి లేనే లేదయ్యో
నువు పోరు నడువయ్యో? పల్లె పల్లెన?
ప్రజాస్వామ్య పాదుల మీద పేలుతున్న గుండ్లు-
కేంద్రం నియంతృత్వ గుండ్లు
ఐటీ ఈడీ సీబీఐల అక్రమ కడగండ్లు-
అవి పక్షపాత గుండ్లు
ప్రశ్నించే గొంతులమీద భయపెట్టే గుండ్లు-
అవి ప్రతీకార గుండ్లు
ఆ గుండ్లకెదురు నిలబడి కదందొక్కయ్యో-
నువు పదంపాడయ్యో? పల్లె పల్లెన?
మతోన్మాద విద్వేషం మనుషుల మధ్య-
అది మారణకాండ
కట్టుబొట్టు తిండిపైన ఆంక్షల బేడి-
అది అణచివేసె దాడి
బహుళత్వం బతుకుల మీద ఆధిపత్య దాడి-
అది ఆగిపోని దాడి
ఆ దాడికెదురు భయం వీడి బయలుదేరయ్యో-
నువు భవిత చూడయ్యో? పల్లె పల్లెన?
భారతమ్మా గుండెమీద బందిపోట్ల మూఠా-
అది బరితెగించే వేట
అదాని అంబానీల అక్రమాల కోట-
దేశం దోచుకునే మూఠా
ప్రభుత్వరంగం ప్రజల ఆస్తుల పైన వారి కన్ను-
ఇక జనం నోట్లో మన్ను
అధికారానికి వాళ్లే దోస్తులు ఆలోచించయ్యో-
నువు ఆగంకాకయ్యో ?పల్లె పల్లెన?
పెరిగే ధరలు నిరుద్యోగం అవి పెరిగే గుట్ట-
అది అదుపులేని గుట్ట
అవినీతి అక్రమాలు అవి చెదలు పుట్ట-
అది చెరపలేని పుట్ట
కార్మిక చట్టాలన్నీ రద్దు అది కక్షల పిడిగుద్దు-
ఇక హక్కులు అడుగొద్దు
రైతుపంటకు ధరలే లేక గుండె చెరువయ్యో-
నువు రాటుదేలి లేవయ్యో ?పల్లె పల్లెన?
ధరణి పేర భూములన్ని తప్పుల తడక-
అవి దారితప్పె నడక
ఆటవి భూముల పోడురైతులకు అందని పట్టాలు-
అవి తీరిపోని ఎతలు
డబుల్ బెడ్రూం దళితబంధులు దండిగా దుఃఖాలు-
అన్నీ తీరని కడగండ్లు
ఆ కడగండ్లన్నీ తీరే దారి పోరే లేవయ్యో-
నువు పోరాడ రావయ్యో ? పల్లె పల్లెన?
- వేల్పుల నారాయణ, 9440433475