Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ నెత్తుటి పొర
ఈ దు:ఖపు తెర
మానవ మనుగడకు
నిత్య బహు చెర
మనిషికి మనసుకి
మిళితమై నడిచె
నెత్తుటి పొర
ఈ దు:ఖపు తెర
*****
ఈ నెత్తుటి పొర
ఈ దు:ఖపు తెర
జీవానికి నిర్జీవానికి
బహుబంధమైన
నిరాధార నిరంతర చెర
నీడలా వెంటాడే
నెత్తుటి పొర
ఈ దు:ఖపు తెర
*****
ఈ నెత్తుటి పొర
ఈ దు:ఖపు తెర
కన్నీళళను పునీతం చేసే
పురిటి నెప్పుల పొర
సహచర చరమగీతం
ఈ చర పొర తెర
నెత్తుటి పొర
ఈ దు:ఖపు తెర
*****
ఈ నెత్తుటి పొర
ఈ దు:ఖపు తెర
శాంతికి సమరానికి
ఆశకి అంగలారిన ఘోషకి
సన్నని ద్రవ గీతం
నెత్తుటి పొర
ఈ దు:ఖపు తెర
*****
ఈ నెత్తుటి పొర
ఈ దు:ఖపు తెర
నిబ్బరాల్ని
నిండైన పంజరాల్ని
శక్తుల్ని, యుక్తుల్ని
కత్తుల్ని, పొత్తుల్ని
కొలుచుకొని
తలచుకొని
వలచుకొని
మలచుకొని
కలుసుకొని
కొని పోవు కలికాలపు చెర
ఈ దు:ఖపు తెర
ఈ మృత్యువు పొర
- డా|| బద్దిపూడి జయరావు,
9949065296