Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంటికలిరబోసుకొని
శిగాలూగుతున్న సీకటి
రాత్రికొమ్మ మీంచి
నిద్రపిట్ట తుర్రుమన్నది
జాడ సూడలేని దేహం
మంచం గూటిల పొర్లుదండాలు పెడ్తాంది
ఈగల్లా ముసురుకున్న ఆలోచనలు దోమల్లా
గుచ్చుతున్న పాత గ్నాపకాలు
నెత్తుటి మడ్గులో హత్య చేయబడ్డ కలలు
నక్కలు ఊలలు పెట్టే యాళ్ళ ఊరు
శవాసనంలో మూల్గుతాంది
పబ్బతి పట్టంగ పట్టంగ
బల్ బల్ తెల్లారంగ అల్సిన పిట్ట గూడుజేరింది
కండ్లు నలుసుకుంట సూత్తే...
అరచేతి అద్దంల ఎర్రని సూర్యగోళాలు
ఇగ దినమంతా ముసురే.
- వడ్లకొండ దయాకర్,
9440427968