Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో అందజేస్తున్న భీమనాథం హనుమారెడ్డి స్మారక పురస్కారం ఈ ఏడాదికి గాను పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి డాక్టర్ ఎస్. వి. సత్యనారాయణకు ప్రదానం చేయనున్నారు. ఈ పురస్కారాన్ని ఈ నెల 23న ఒంగోలులో నిర్వహించే హనుమారెడ్డి జయంతి వేడుకలలో అందజేయనున్నట్టు సంఘం అధ్యక్షులు పొన్నూరు వేంకట శ్రీనివాసులు తెలిపారు.