Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హుస్నాబాద్ పాఠశాల 75 ఏళ్ళు నిండిన సందర్భంగా ఏప్రిల్ 23 నుండి మే 1 వరకు వజ్రోత్సవ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అన్నవరం దేవేందర్ సంపాదకత్వంలో వెలువడిన 'వజ్రోత్సవ కవిత'ను ఈ నెల 25న మంగళవారం నాడు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో శాసనమండలి సభ్యులు దేశపతి శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా వచ్చి ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితెల సతీష్ కుమార్, వజ్రోత్సవ కమిటీ చైర్మన్ కొండ లక్ష్మణ్, సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ జివి శ్యాంప్రసాద్ లాల్, ప్రముఖ న్యాయవాది కవి గులాబీల మల్లారెడ్డి పాల్గొంటారు. వివరాలకు 9440981718 నంబరు నందు సంప్రదించవచ్చు.