Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'తాటికొండ' ఏంటయ్యా...పెద్ద హోదాలో ఉండి కూడా ఇదేం బుద్ది...ఇది నీకు తగునా? అంటూ సోషల్ మీడియాలో స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గురించి వెలువడుతున్న కామెంట్లు. ఇవి ఆయన మీద వస్తున్న రుమార్లు కావు. మహిళల పట్ల అనుచిత ప్రవర్తనతో చాలాకాలం నుంచి ఆయన వార్తల్లో నిలిచారు. ఉపముఖ్యమంత్రి పదవి కూడా అందుకే ఊడిందనే పుకార్లు అప్పట్లోనే చక్కార్లు కొట్టాయి. ఆ ఎమ్మెల్యేకు మహిళలు కనిపిస్తే చాలు...ఆగలేరన్న ప్రచారం ఉంది. ప్రచారమే కాదు.. అనేకసార్లు ఆయన చిలిపి చేష్టల ఆడియోలు వైరల్ అయ్యాయి. ఆయన పుట్టినరోజు వేడుకల్లోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ఆ వీడియో కూడా హల్చల్ చేసింది. ఆయన పెద్ద పదవిలో ఉన్నప్పుడు సాయుధ బలగాల రక్షణ వలయంలో గంటల తరబడి 'ఓ ఇంట్లో' సేద తీరడంతో ఆ ఊరి వారంతా ఇబ్బంది పడ్డారని వార్తలొచ్చాయి. చాటింగ్లకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకొనే సదరు ఎమ్మెల్యే... ఓ చాటింగ్ బహిర్గతమై పదవికే ఎసరొచ్చింది. అయినా ఆయనలోపల పశ్చతాపం లేదు. మార్పు అంతకన్నా లేదు. పార్టీకి కూడా చెడ్డపేరు వస్తుందన్న చర్చ పార్టీలో ఉన్నది. వచ్చే ఎన్నికల్లోనూ ఆయనకు టికెట్ గండం కూడా ఉందనే ప్రచారం జరుగుతున్నది. రాజయ్య వ్యవహార శైలి నిజమేనంటూ మహిళా సర్పంచ్ నవ్య కుండబద్దలు కొట్టినట్టు ధైర్యంగా మీడియా ముందుకొచ్చి ప్రపంచానికి చెప్పారు. అధికార పార్టీ ఎమ్మెల్యే అని చూడకుండా ఎదురుతిరిగారు. బీఆర్ఎస్ మహిళా నాయకురాలి వలలో చిక్కుకోకుండా చాకచక్యంగా బయట పడ్డారు. ఆమె ధైర్యానికి జేజేలు అందుకుంటున్నారు. దటీజ్ నవ్వ.
- గుడిగ రఘు