Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'అరెస్టు చేయకపోతే ముద్దు పెట్టుకుంటారా?' అంటూ ఎమ్మెల్సీ కవితను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరు చేసిన కామెంట్స్ రాష్ట్రంలో కాక రేపాయి. దీనిపై బీఆర్ఎస్ నేతలు రోడ్లెక్కి నానా హడావిడి చేశారు. ఇదేదో సానుభూతిగా మారి తన కొంప ముంచేట్టు ఉందని ఊహించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్...ఆ కామెంట్స్ బండి వ్యక్తిగతం అంటూ కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. 'గుండు' నువ్వేం తక్కువోడివి కాదు. గతంలో నువ్వూ ఇట్టానే మాట్లాడావ్ అంటూ బీఆర్ఎస్ మహిళలు శాపనార్థాల చిట్టా విప్పి, అగ్గిలో ఆజ్యం పోశారు. దీంతో బీజేపీలో ఉన్నాడో లేడో తెలీని ఎమ్మెల్యే రాజాసింగ్ స్వీయ మధ్యవర్తిత్వం వహిస్తూ, అటు బండికి, ఇటు గుండుకు హితోక్తులు చెప్పే ప్రయత్నం చేస్తే, అహే...ఆయనేంది చెప్పేది... ఆడు మా పార్టీనే కాదంటూ మరికొందరు బీజేపీ నేతలు ఎదురుదాడికి దిగారు. ఇక్కడ ఎవరికి వాళ్లు సెల్ఫ్ గోల్స్ చేసుకొని, జనానికి మాత్రం 'ఆస్కార్' లెవల్లో మస్తు ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. ఏమిరా మీ వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం?
-కెఎన్ హరి