Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తల్లిగా మహిళని గౌరవించడం, ఆరాధించడం ఒక్కటే సరిపోదు. ఆమెకు సంబంధించిన ప్రపంచంలోకి తొంగి చూడాలి. అలాంటి చూపు సమాజంలో కొరవడింది. సహనంలో, ప్రేమ చూపడంలో అమ్మ అనురాగ దేవత అనడంలో సందేహం లేదు. కానీ అమ్మ కూడా మనిషే. ఆమెకు ఇష్టాయిష్టాలుంటాయి. తనవైన అభిరుచులూ ఉంటాయి. తనకూ విశ్రాంతి కావాలని ఉంటుంది. కనుకనే 'అమ్మకు ఆదివారం లేదా' అని ఒక కథలో రంగనాయమ్మ ప్రశ్నించారు. మదర్స్ డే సందర్భంగా శ్రమజీవి అమ్మ గురించి తలపోసేవారు అమ్మల మానసిక ప్రపంచాల గురించి యోచించాలి. వారి కోణంలో వారి జీవితాన్ని నెట్టుకొచ్చిన వైనాన్ని దర్శించాలి. అన్నింటి కంటే ముందు అమ్మను ప్రేమించాలి. నాలుగు మాటలు పంచుకోవాలి.
చరిత్రలో అమ్మకూ ఓ రోజు స్థిరపడింది. అంటే ఈ ఒక్కరోజు అమ్మపై ఎక్కడలేని ప్రేమను కురిపించి.. మిగిలిన రోజుల్లో ఆమెను పట్టించుకోవడం మానేస్తే సరిపోతుందా? సమాజంలో నిత్యం చోటు చేసుకుంటున్న ఘటనలు ఇలాంటి ప్రశ్నలే సంధిస్తున్నాయి. 'కాకి పిల్ల కాకికి ముద్దన్నట్లు' బిడ్డ అవిటిదైనా, కురూపి అయినా తల్లికి ముద్దే. ఎన్ని కష్టాలు పడి అయినా.. కొన్నిసార్లు బిడ్డ బతకదని తెలిసినా.. చివరి నిమిషం వరకు బిడ్డ గురించి తపించే తల్లులెందరో తన రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడేది, తన బిడ్డల సుఖం కోసం అన్న ఎరుకతో ఉండేది అమ్మ ఒక్కటే. తొమ్మిది నెలలు కడుపులో మోసి.. జన్మనివ్వడానికి తను మరణం అంచుల వరకు వెళ్తుంది. అలాంటి మాతమూర్తి త్యాగం వెలకట్టలేనిది. కానీ, కొన్ని సంఘ టనలు హదయాన్ని కకాలావికలం చేస్తున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో ఆస్తి పంచలేదని తల్లి శవాన్ని వదిలేసి వెళ్లిన కూతుళ్లను చూశాం. సిద్దిపేట జిల్లాలో తనను చూసే బాధ్యతను వంతుల వారిగా పంచుకోవడాన్ని తట్టుకో లేక తన చితితానే పేర్చుకొని నిప్పు పెట్టుకున్నాడో తండ్రి. ఇవి మానవత్వానికి మచ్చలు.
అమ్మ ప్రేమ సత్యం అని చలం అంటే... సమాజాన్ని మార్చే పోరాటంలో భాగస్వామిగా నిలిచినందుకు గర్విస్తూ కన్నతల్లిని స్మరించుకున్నాడు కవి శివసాగర్. కల్మశం లేనిది, కలుషితం కానిది అమ్మ ప్రేమ. అమ్మ అనురాగం మరింత స్వచ్ఛం. అందుకే శతాబ్దాలుగా కవులు, రచయితలు అమ్మ గురించి కావ్యాలు సజించారు. అమ్మని వేనోళ్ళ స్తుతించారు. తల్లి కావడం సహజాతి సహజ పరిణామం. కానీ, నేడు అమ్మతనం మార్కెట్కు సరుకయ్యింది. దానిని గ్లామరైజ్ చేయడంతోపాటు కోట్లాది రూపాయల వాణిజ్యంగా మార్చారు. దీనిలో భిన్నకోణాలున్నాయి. ఆడపిల్ల పుట్టుకని నిరాకరించే దుర్మార్గముంది. పుట్టిన ఆడపిల్లల్ని వద్దనుకొని అమ్ముకునే దుస్థితి ఉండనే ఉంది. ఆడపిల్లల్ని కనడం, పెంచడం పట్ల వివక్ష చూపిస్తున్నారు. ఇది మన సమాజంలో నెలకొన్న ద్వంద్వ విలువలకు నిదర్శనం.
మదర్స్ డేని ఘనంగా జరుపుకోడం, అమ్మలకు విషెస్ చెప్పడం మామూలే. కానీ అమ్మల ఆరోగ్యం మీద పట్టింపు ఏది? మన సమాజంలో ఇంటా బయటా పనిచేసే మహిళల శారీరక, మానసిక ఆరోగ్యాలపై శ్రద్ధ కనబరిచేవారు తక్కువ. పెళ్ళికి ముందు, పెళ్ళయ్యాక, తల్లి అయిన తరువాత స్త్రీల ఆరోగ్యంలో మార్పులు సహజం. వాటిని అర్థం చేసుకునే సున్నితత్వం జీవన భాగస్వాముల్లోనూ అరుదు. ఉమ్మడి కుటుంబాలు లేకపోవడంతో తనకు తానే ఓదార్పు కావాల్సిన స్థితిలో మహిళలు తల్లడిల్లుతున్నారు. అమ్మతనం ఔన్న త్యాన్ని అతి సుందరంగా అక్షరీకరిస్తారు. కానీ వారి మానసిక కల్లోలాల మీద స్పందన కనిపించదు. డబ్బులున్న కొడుకులయితే కానుకలిస్తారు. డబ్బులు పంపిస్తారు. కానీ అమ్మను చెంతన ఉంచుకునే వారు కరువయ్యారు. విడాకులు తీసుకున్న తల్లులు, వితంతువులయిన తల్లులు తమ దు:ఖాన్ని తామే దిగమింగుతూ రోజులు వెళ్ళదీయాల్సిన స్థితి నెలకొంది. పిల్లలకు రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు పెరిగినట్టుగానే అమ్మలకు, నాన్నలకు వద్ధాశ్రమాలు విరివిగా పెరుగుతున్నాయి. లేదంటే వీధుల్లో నివాసాలేర్పడుతున్నాయి.
ఒక అమ్మపట్లనే కాదు, కుటుంబ సంబంధాలలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వస్తు వినిమయదారీ తత్వంలో మనిషిని ముంచేసాక అన్నీ వినిమయ విలువలే మనసును ఆక్రమిస్తాయి. అమ్మనో, నాన్ననో చూడటానికి, మాట్లాడటానికి, ప్రేమతో పలకరించ టానికి బదులుగా వారికో బహుమతి పంపితే చాలన్న రీతిలో మానవ సంబంధాలను మార్కెట్ సంస్కతి ప్రభావితం చేస్తోంది. అంటే ప్రతిదీ డబ్బుతో కొనేదిగా, అనుభవించేదిగా, తప్తిపడేదిగా మారిపోయింది. అందులో అమ్మ ప్రేమకు కూడా స్థానం కల్పించారు. దీనికి కారణం ప్రపంచంలో పెట్టుబడి సష్టిస్తోన్న సాంస్కతిక హీన భావజాలం.
తల్లిగా మహిళని గౌరవించడం, ఆరాధించడం ఒక్కటే సరిపోదు. ఆమెకు సంబంధించిన ప్రపంచంలోకి తొంగి చూడాలి. అలాంటి చూపు సమాజంలో కొరవడింది. సహనంలో, ప్రేమ చూపడంలో అమ్మ అనురాగ దేవత అనడంలో సందేహం లేదు. కానీ అమ్మ కూడా మనిషే. ఆమెకు ఇష్టాయిష్టాలుంటాయి. తనవైన అభిరుచులూ ఉంటాయి. తనకూ విశ్రాంతి కావాలని ఉంటుంది. కనుకనే 'అమ్మకు ఆదివారం లేదా' అని ఒక కథలో రంగనాయమ్మ ప్రశ్నించారు. మదర్స్ డే సందర్భంగా శ్రమజీవి అమ్మ గురించి తలపోసేవారు అమ్మల మానసిక ప్రపంచాల గురించి యోచించాలి. వారి కోణంలో వారి జీవితాన్ని నెట్టుకొచ్చిన వైనాన్ని దర్శించాలి. అన్నింటి కంటే ముందు అమ్మను ప్రేమించాలి. నాలుగు మాటలు పంచుకోవాలి.