Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్త్రీ కి అన్ని రంగాలలో సమాన అవకాశాలుండాలని కోర్టులు పలుసార్లు చెప్పాయి. తాజాగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ)లో మహిళల ప్రవేశానికి సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది. సెప్టెంబర్ నెలలో జరగబోయే ఎన్డీఏ పరీక్షకు మహిళలను అనుమతించాలంటూ సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆర్మీ నిర్ణయాలు మహిళలపై వివక్ష చూపించేలా ఉన్నాయని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇకనైనా ఇలాంటి మైండ్‌సెట్‌ను మార్చుకోవాలని సూచించింది.
సెప్టెంబరు 5న ఎన్డీఏ పరీక్ష జరగనుంది. అయితే ఈ పరీక్షకు మహిళా అభ్యర్థులను అనుమతించక పోవడంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై నేడు విచారణ జరిపిన న్యాయస్థానం సైన్యం విధానాలపై అసహనం వ్యక్తం చేసింది. సాయధ బలగాల్లో పురుషులు, మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలని కోర్టు ఆదేశించింది.
''లింగ వివక్ష ఆధారంగా మీ విధాన నిర్ణయం ఉంది. నేవీ, ఎయిర్‌ఫోర్స్ లాంటి వాటిల్లో మహిళలను అనుమతిస్తుంటే మీరెందుకు అనుమతించట్లేదు. ఎన్డీఏ పరీక్షకు మహిళలు హాజరయ్యేందుకు మేం అనుమతినిస్తున్నాం. తుది తీర్పునకులోబడి ప్రవేశాలు జరగాలి'' అని కోర్టు స్పష్టం చేసింది.
సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో, స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగే నిరంతర జీవనాధార అవకాశాలు తామే స్వయంగా నిర్మించుకోగలిగే ఉన్నత స్థితికి చేరుకుని స్త్రీ శక్తి ఏంటో ప్రపంచానికి తెలియజెప్పుతూనే ఉన్నారు. విద్య, వైద్యం, వ్యాపారాలు, రాజకీయాలు, క్రీడలు, బ్యాంకింగ్, అంతరిక్షం, టెక్నాలజీ వంటి పలు రంగాల్లో మహిళలు రాణిస్తూ మహిళా సాధికారత సాధన దిశగా అడుగులు వేస్తున్నారు.
అయినప్పటికీ మహిళలు నిత్యం వివక్షకు, దాడులకు గురవుతూనే ఉన్నారు. రోజురోజుకూ మహిళలుపై రకరకాల దాడులు జరుగుతున్నాయి.వీటిల్లో యాసిడ్ దాడులు ముఖ్యమైనవి. ప్రపంచవ్యాప్తంగా యాసిడ్ దాడులు జరిగినప్పటికీ, ఈ రకమైన హింస దక్షిణ ఆసియాలో సర్వసాధారణమైంది. (18) యాసిడ్ సర్వైవర్స్ ట్రస్ట్ ఇంటర్నేషనల్ (Aూు×) ప్రకారం, ప్రపంచంలో తలసరి అత్యధిక యాసిడ్ దాడుల రేటు యుకెలో ఉంది.ఖఖ, ప్రపంచ తలసరి యాసిడ్ దాడుల అత్యధిక రేట్లలో ఒకటిగా ఉంది 2016లో, Aూు× గణాంకాల ఆధారంగా యుకెలో 601కి పైగా యాసిడ్ దాడులు జరిగాయి, బాధితుల్లో 67శాతం మంది పురుషులు, కానీ అదే Aూు× గణాంకాలు ప్రపంచవ్యాప్తంగా 80శాతం బాధితులు మహిళలు అని సూచిస్తున్నాయి. గత ఐదేండ్లలో 1,200 కేసులు నమోదయ్యాయి. 2011 నుండి 2016 వరకు లండన్‌లో మాత్రమే 1,464 నేరాలు యాసిడ్ లేదా శరీరాన్ని తినివేసే పదార్థంతో సంబంధం కలిగి ఉన్నాయి.
మహిళలపై గహహింస మరొకరకమైన దాడి. వేధింపులకు గురవుతున్న మహిళలకు రక్షణ కవచంగా ప్రభుత్వం గృహహింస నుండి మహిళల (43/2005 చట్టం) రక్షణ చట్టానికి 2005లో పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ చట్టం 2007లో ఉమ్మడి రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. జిల్లా స్త్రీ, శిశు సంక్షేమశాఖ దీన్ని అమలు చేస్తుంది. ఆ శాఖ జిల్లా పీడీ రక్షణాధికారిగా వ్యవహరిస్తున్నారు. కేసుల నమోదు, బాధితులకు న్యాయ సహాయం చేసేందుకు ఒక కౌన్సిలర్‌తో పాటు న్యాయవాదిని ప్రభుత్వం నియమించింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని గుర్తించి, వారిని కోర్టుకు తీసుకెళ్లేందుకు పోలీసు హౌంగార్డులను నియమించారు. వివక్షతో కూడిన ఆచారాలు, పద్ధతులు అభిప్రాయాలతో సమాజంలోనే కాకుండా ఇంట్లో కూడా స్త్రీ, పురుష సంబంధాల్లో అసమానతలు ఏర్పడి గృహహింసకు దారితీస్తున్నాయి. నిత్యం మహిళలు గృహహింసకు గురవుతున్నప్పటికి వారు సరైన న్యాయ సలహాలు తెలియక పోవటంతో ఇటువంటివి మరిన్ని పెరిగిపోతున్నాయి. కరోనా కాలంలో దేశంలో గృహహింస కేసులు పెరిగినట్లు జాతీయ మహిళా కమిషన్ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మహిళల రక్షణకు కేంద్రం నిర్భయ చట్టం తీసుకు రాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిశ చట్టాన్ని తీసుకొచ్చింది.
ఇటీవల ఒలింపిక్ క్రీడల్లో కూడా మనదేశం తరుపున మహిళలు అద్భుతమైన ప్రదర్శన చేశారు. మహిళా సాధికారతకు విద్యే అసలైన పరిష్కారం. పెరుగుతున్న బాల్య వివాహాలు స్త్రీలు ఉన్నత విద్య అభ్యసించడానికి అడ్డంకిగా మారుతుంది.
ఐక్య రాజ్య సమితి ప్రతి ఏడాది ఆగస్ట్ 26న స్త్రీల సమానత్వ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. దీనితోపాటు ప్రతి ఏడాది మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా నిర్వహిస్తారు. ఆధునిక కాలంలో మహిళల పట్ల పురుషుల వైఖరి మారాలంటే ఇంటి దగ్గరనుంచే మార్పు రావాలి. విద్యా సంస్థలలో యువతకు కౌన్సెలింగ్ ఇవ్వాలి. చట్టాలను పటిష్టంగా అమలు చేయడంతో పాటు, వాటి పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలి. బాల్య వివాహాలని అరికట్టగలిగితే బాలికలు ఉన్నత విద్యని అభ్యసించడానికి అవకాశం ఉంటుంది. తద్వారా వారికి అన్ని రంగాల్లో పురుషులతో పాటు సమాన హక్కులు, అవకాశాలు లభిస్తాయి.
- ఎం. రాంప్రదీప్
సెల్: 9492712836