Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నల్లసూర్యులు అని ఘనకీర్తిగా పొగడబడతున్న సింగరేణి బొగ్గుగని ఉద్యోగుల పరిస్థితి ఆచరణలో సూర్యగ్రహణం లాంటిది. మరీ దిగిపోయిన ఉద్యోగుల స్థితి అమావాస్య చంద్రుని వంటిది. కాలిపోయిన బొగ్గు నుండి వచ్చిన బూడిదను ఇటుకలు తయారు చేయుటకు ఉపయోగిస్తారు. కాని బూడిదకు ఉన్నంత విలువ కూడా సింగరేణిలో దిగిపోయిన ఉద్యోగులకు లేదు.
సీఎం పిఎస్ (షశీaశ్రీ ఎఱఅవర జూవఅరఱశీఅ రషష్ట్రవఎవ) 1998 ఒప్పందం ప్రకారం సింగరేణిలో, కోల్ ఇండియాలోని బొగ్గుగని కార్మికులకు చివరి నెల వేతనం ఆధారంగా 25శాతం పెన్షన్ చెల్లిస్తున్నారు. ఈ ఒప్పందం ప్రకారం ప్రతి మూడేండ్లకు ఒకసారి పెన్షన్ సవరణ జరగాల్సి ఉండగా, 23 సంవత్సరాలు గడిచినా ఇంత వరకు పెన్షన్ పెంచుటకు చర్యలు తీసుకోలేదు. చాలామంది కార్మికులు నెలకు మూడు వందల నుండి వెయ్యి రూపాయలు పెన్షన్ తీసుకుం టున్నారు. ఈ పెన్షన్‌తో బతకడం భారం అవుతున్నది. అదే విశ్రాంత అధికారులకు నెలకు రెండు పెన్షన్లు ఇస్తున్నారు. పదవీ విరమణ చేసిన చివరి నెల ఆధారంగా 25శాతం పెన్షన్, ఎన్పీఎస్ ప్రకారం మరో పెన్షన్ ఇస్తున్నారు. ఇదే కాక గ్రాట్యుటీ విశ్రాంత అధికారులకు జనవరి 2016 నుండి కార్మికులకు మార్చి 2018 నుండి చెల్లిస్తున్నారు. సింగరేణిలో ఒక నినాదం ఉంది, ఒకే కుటుంబం ఒకే లక్ష్యం.. ఒకటే గమనం.. అని, కానీ పదవీ విరమణ చేసిన తర్వాత ప్రతి చెల్లింపులో కూడా వివక్ష ఉంది. సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు కల్పిస్తున్న వైద్య సౌకర్యాలు కూడా ఎండమావుల వంటివే. సింగరేణి ప్రాంతంలో ఉన్న ఏరియా దవాఖానాల్లో విశ్రాంత ఉద్యోగులకు నామమాత్రపు ఉచిత వైద్య సౌకర్యాలు అందిస్తున్నారు. చాలామంది విశ్రాంత ఉద్యోగులు హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం ఇతర ప్రాంతాలు, ఆంధ్రప్రదేశ్‌లో నివాసం ఉంటున్నారు. ఈ సింగరేణి దవాఖానాలకు మందుల కోసం ప్రతి నెల సుదూర ప్రాంతాల నుండి పోవాలంటే అనేక వ్యయ ప్రయాసలతో కూడుకున్నది. చాలీచాలని పెన్షన్‌తో కాలం సాగాదిస్తున్నవారికి ఆరోగ్యం కూడా సరిగా సహకరించదు. కాబట్టి చారానా కోడికి బారాన మసాల వంటిది ఈ వైద్య సౌకర్యం.
ప్రతి విశ్రాంత ఉద్యోగి నుండి రూ.40,000 కట్టించుకుని జూ=వీూజు చీజు హెల్త్ కార్డులు భార్య భర్తలు ఇరువురికి కలిపి జీవిత కాలంలో ఎనిమిది లక్షలకు వైద్య సౌకర్యం పొందుటకు ఇచ్చారు. ఎంపిక చేసిన కొన్ని దవాఖానాలలో వైద్యం పొందుటకు వీలు కల్పించారు. ప్రతినిత్యం వైద్య ఖర్చులు పెరుగుతున్న ఈ రోజులలో ఈ ఎనిమిది లక్షలు ఎందుకు సరిపోవు. ఇందులో కూడా అయా దవాఖానాలు సరిగా స్పందించక అనేక కష్టనష్టాలకు గురిచేస్తుంటాయి. అదే విశ్రాంత అధికారులకు భార్యభర్తల ఇరువురికి కలిపి రూ.25 లక్షలు వారి జీవిత కాలంలో వైద్య సౌకర్యం పొందుటకు ఇచ్చారు. ఒకే కుటుంబం ఒకే లక్ష్యం ఒకే గమనం అని సంస్థ చెబుతున్నది. అధికారి శరీరమైనా, ఉద్యోగి శరీరమైనా అందరిదీ ఒకటే రక్తం కదా? మరి ఎందుకు ఈ వివక్ష? విశ్రాంత అధికారులకు ఇదే కాక ప్రతి సంవత్సరం వైద్య సౌకర్యం ఖర్చుల నిమిత్తం సంవత్సరానికి రూ.36,000 ఇస్తున్నారు. ఇదో వింత పోకడ. ప్రతి విషయంలో ఉద్యోగుల పట్ల సవిత తల్లి ప్రేమను చూపిస్తున్నారు.
పై రెండు వైద్య సౌకర్యాలు పొందుటకు సింగరేణి విశ్రాంత ఉద్యోగులు తాము బతికి ఉన్నట్లు సంవత్సరంలో రెండుసార్లు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించవలసిన ఉన్నది. ఇదే కాక పెన్షన్ పొందుటకు మరొకసారి లైఫ్ సర్టిఫికెట్ తప్పక తీసుకోవాలి. ప్రతి విశ్రాంత ఉద్యోగి తాను బతికి ఉన్నట్లు సంవత్సరంలో మూడుసార్లు లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలి. ఒక జీవనం మూడు లైఫ్ సర్టిఫికెట్లు. మరొక విషయం సింగరేణి అధికారులకు హైదరాబాద్ శివారు ప్రాంతంలో ఇల్లు కట్టుకొనుటకు స్థలాలు కేటాయించటానికి ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలియ వస్తున్నది. కానీ ఉద్యోగులకు స్థలాలు కేటాయింపునకు ఎలాంటి ప్రయత్నం జరగడం లేదు.
సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు విశ్రాంత కార్మికుల సమస్యలను పరిష్కరించుటకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. భూతద్దంలో చూసినా వీరు ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగులకు కల్పిస్తున్నట్లు ఉచిత వైద్యం సౌకర్యం సింగరేణి విశ్రాంత ఉద్యోగులకు కూడా కల్పించాలని కోరుతున్నారు. సింగరేణి సొమ్మును తెలంగాణ రాష్ట్ర నలుమూలల ఆయా ప్రాంతాల అభివృద్ధికి వెచ్చిస్తున్నారు. విశ్రాంత ఉద్యోగులకు కూడ కొంత సొమ్ము కేటాయించి తోడ్పడాలి. తరతసింగరేణి సంస్థ లాభాల బాటలో నడుస్తున్నదంటే దిగిపోయిన ఉద్యోగుల భాగస్వామ్యం కూడా ఉంటుంది. విశ్రాంత ఉద్యోగుల వైద్య సౌకర్యాల సమస్యలను తక్షణమే పరిష్కరించి పెన్షనర్ల జీవితాల్లో వెలుగునింపాలి.
- దండంరాజు రాంచందర్ రావు
సెల్:9849592958