Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రపంచమంతా యాంత్రిక జీవితంలో ముందుకు వెళుతున్న సందర్భంలో సంఘటిత అంశం అయినటువంటి వాతావరణాన్ని పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉన్నది. కానీ మనం ఎంత వరకూ ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ ఓజోన్ పొర వల్ల భవిష్యత్తులో జరిగే ప్రభావాల ఫలితం ప్రతి ఒక్కరికి కూలంకుషంగా తెలియాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనగా రేపటికి రూపం కావాలి.
మరి రేపటి ప్రపంచ మనుగడ కోసం మనమే బాధ్యత తీసుకోవాలి. భావితరాలు సురక్షితంగా ఉండాలి అంటే ఇప్పటి నుండే ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుంటేనే రేపటికి రూపం ఉంటుందని భావించాలి. నేటి కాలంలో హైదరాబాద్, ఢిల్లీ, ముంబాయి లాంటి మహా నగరాలలో ఎంత కాలుష్యం ఉంటుందో మరొక్కసారి మీకు తెలియజేయడం అవసరం లేదు. కానీ వాటితో పాటుగా నేడు చిన్న చిన్న పట్టణాల తో పాటుగా ప్రతీ గ్రామాల తో సహా కాలుష్యం తో కూడుకొని పర్యావరణాన్ని, వాతావరణాన్ని కాలుష్యం చేయుచున్న విషయం కూడా మీకు తెలిసినదే.. ఎందుకు మీకు ప్రత్యక్ష సాక్ష్యం గా చెప్పాలి అంటే ఒకప్పుడు ఒక ఇంటికి ఒక వాహనం మాత్రమే ఉండేది కానీ ఇప్పుడు ఒక్కొక్క ఇంటికి దాదాపుగా రెండు రెండు వాహనాలు ఉంటున్నాయి. ఆ వాహనాలతో చాలా పెద్ద మొత్తంలో కాలుష్యం ఏర్పడుతుంది. ఇప్పుడిప్పుడే భారతదేశంలో నిబంధనలతో కూడిన వాహనాలకు అనుమతులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటే మనం పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఎంతో అవకాశం ఉంటుంది. భావితరాలకు బాసటగా కూడా మనమే నిలుస్తాం. మరి భావి తరాల ను కాపాడుకోవాల్సి ఉంది మనమే కదా....!! ఒక్కసారి ఆలోచించండి...!! ఇది ఎవరి బాధ్యతో కాదు. మనందరి బాధ్యత మన అందరి సమిష్టి కృషి వల్లనే ఇది సాధ్యం అవుతుంది. ఇట్టి అంశంపై ప్రపంచం మొత్తంలో ఎన్నో సెమినార్లు, ఎన్నో సమావేశాలు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. మన వంతుగా మన బాధ్యతను నిర్వహిస్తాం. కాలుష్యరహిత వాతావరణాన్ని భావితరాలకు నిర్మించుకుందాం.
మరో ముఖ్యమైన విషయం చెప్పాలంటే మొన్నటి వరకు కరోనా కారణంగా మన దేశంతో పాటు వివిధ దేశాలలో లాక్ డౌన్ నిర్వహించడం వల్ల వాతావరణం ఓజోన్ పొరలో మార్పు ఎంతవరకు జరిగిందో మనం గమనించవచ్చు.
- డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్