Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మార్చి మొదటి వారం కూడా ఇంకా పూర్తి కాలేదు. రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 10 గంటలు దాటితే చాలు... బయటికెళ్లాలంటే భయపడాల్సి వస్తున్నది. మళ్లీ సాయంత్రం ఐదైతేగానీ సూరీడు చల్లబడటం లేదు. ఈ యేడు ఎండలు హాఫ్ సెంచరీ (50 డిగ్రీలు) దాటటం ఖాయమని వాతావరణ శాఖ ఇప్పటికే బాంబు పేల్చింది. ఈ విషయాన్ని ముందే గ్రహించిందో ఏమో... కొబ్బరి బోండా తన రేటును రూ.30 నుంచి రూ.40కి పెంచేసింది. ఇందులో ఇంకో తిరకాసుంది... ఏలూరు, రాజమండ్రి బోండాలైతే రూ.40కే దొరుకుతున్నాయి. అదే బెంగళూరు, కేరళ కాయలైతే రూ.50 పెట్టాల్సిందే. మరోవైపు ఐదు రాష్ట్రాల ఎన్నికలై పోయాయి కాబట్టి... మరో రెండు, మూడు రోజుల్లో పెట్రోల్ ధరలు లీటరుకు రయ్యున రూ.120 దాకా ఎగబాకనున్నాయి. ఇలా ఒకవైపు ఎండలు, మరోవైపు రేట్లు... వెరసి సామాన్యుడికి దూల తీరిపోనుంది. వీటికి పరిష్కారం చెప్పాల్సిన ప్రభుత్వ పెద్దలేమో... నీడలో కూర్చుని నిమ్మరసం తాగుతూ, నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు...
-ఎస్.వెంకన్న