Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కష్టజీవులు, నిరుపేదలు, పేదల పక్షాన కమ్యూనిస్టులు కొట్లాడ్తతరు అనేది జగమెరిగిన సత్యం. కానీ పెద్ద పెద్దోళ్లకు ఎర్రజెండా కంటగింపుగా ఉంటది. జీవనయానంలో కష్టాలు వచ్చినప్పుడు పెద్దోళ్లులేరు. చిన్నోళ్లు లేరు ఎవరైనా సరే... కమ్యూనిస్టులు బలంగా ఉంటే బాగుండు అని అనుకుంటున్నారు. సగటు జీవులతోపాటు రాజకీయ నాయకుల నోట ఇటీవల కమ్యూనిస్టుల ప్రస్తావన వినిపిస్తున్నది. ఇటీవల టీపీసీసీ చీఫ్ రేవంత్ కూడా బహిరంగసభ వేదికగా కమ్యూనిస్టుల ప్రస్తావన తీసుకొచ్చారు. మంత్రి గంగుల కమలాకర్ కూడా కమ్యూనిస్టు ప్రణాళిక గొప్పతనాన్ని చెబుతూనే... కమ్యూనిస్టుల త్యాగనిరతిని కొనియాడారు. వీరే కాదు కమ్యూనిస్టులను ఒకింత సమర్థించలేని వారు సైతం... కావాలనుకునే వారి సంఖ్య పెరుగుతున్నది. ఇవాళ అసెంబ్లీకి చెందిన సీనియర్ ఉద్యోగి, బలమైన కాంగ్రెస్ అభిమాని కూడా. అతను అసెంబ్లీ నుంచి నాతోపాటు బయటకు వచ్చారు. నా ప్రమేయం లేకుండా ఆయన ఇలా చెప్పడం ప్రారంభించారు. ఏమండీ... అంటూ 'ప్రస్తుత రాజకీయాలు చూస్తుంటే నాకు చికాకొస్తుంది. కమ్యూనిస్టులు బలహీనంగా ఉండటం వల్ల రాజకీయాల్లో రంజుతనం లేకుండాపోయాయి. మొత్తం రాజకీయ నాయకుల రంకుతనమే కనిపిస్తుంది. ఎవడికి దొరికినంత వారు దోచుకుంటున్నారు. ఓటర్లకు బీర్లు, బిర్యానీ అలవాటు చేసి ఓట్లు వేయించుకుంటున్నారు. ఎన్నికల్లో ఖర్చు చేసిన సొమ్మును అధికారంలోకి వచ్చాక ఏదో రాబట్టుకుంటున్నారు. మత విశ్వాసాలను రాజకీయాల కోసం వాడుకుంటున్నారు. ప్రశ్నించేవారిని అణిచివేయడంతో రాజకీయాల్లో మజా లేకుండాపోతుంది. ఏమైనా కమ్యూనిస్టులు బతకాలండీ... వారు లేకపోతే సగటుజీవిని రక్షించే నాథుడే ఉండడు. కమ్యూనిస్టులు బలహీనంగా ఉండటంతో పాలకులకు భయమూ... భక్తి లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో మరో ప్రస్తావన తెచ్చారు. వాట్సాప్ గ్రూప్‌ల్లోనూ ఎర్రజెండా రెపరెపలు గుర్తుకొస్తున్నాయి. చివరికి కామ్రేడ్‌కు ఉన్న ట్రెండ్‌ను క్యాచ్ చేసుకునేందుకు 'కామ్రేడ్ టీవీ న్యూస్' పేరుతో వచ్చేస్తుంది. దీనంతటికి కారణం పాలకుల నుంచి ముంచుకొస్తున్న ప్రమాదం గుర్తుకు రావడమేనని అర్థమవుతున్నది.
- గుడిగ రఘు