Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్కడ రాబందుల రెక్కల
చప్పుళ్లకు పసికందులు
భీతావహులై ఆకలి తల్లి
ఆకుల కింద దాగుతున్నాయి
నలుదిక్కుల పిక్కటిల్లేలా
భయాందోళనల్ని ఒక్కటిగా చేస్తున్న
డేగల డెక్కల శబ్దాలకు
దశాబ్దాలు నిండని పసిబాల్యం
నుసివాడకముందే మసైపోతోంది..
ఆకలిగొన్న పెద్దబోజల
హాహాకారాలకు జడుసుకుని
చిన్నిబుజ్జాయిలు ఎండిన డొక్కల
తల్లుల నీడలో జారుకున్నాయి..
పెద్ద బోజల పెద్ద బొజ్జల్ని
నింపుకోడానికి అక్కడ కన్యత్వం
నిత్యనూతనంగా వివస్త్రయి
మానవత్వానికి
సవాలక్ష సవాళ్లు విసురుతోంది
జీవితాల్ని చీరేస్తున్న దారిద్య్రాన్ని
పసిగట్టని అమాయక పసిదేహాలు
అన్యాయంగా కరమగాల
కరడుగట్టిన దాహానికి ఛిద్రమౌతున్నాయి..
గాంధారంలో ఆకలి బ్రోకర్‌గా మారి
దారిద్య్రం హౌల్ సేల్ డీలర్‌గా మరి
మానవత్వాన్ని నారాజ్ చేస్తూ
ఇరవై రోజుల పసికందును
పెళ్లి పేరుతో హరాజ్ చేస్తోంది..
- సర్ఫరాజ్ అన్వర్.
సెల్: 9440981198