Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రమణ మరణం
శోక సముద్రాన్ని మిగిల్చింది!
ఆయన కలలు నెరవేరకుండానే
అర్థాంతరంగా వెళ్ళిపోయాడు!
తన జీవితాన్ని మనకోసం పరిచి పోయాడు!
ఆ రహదారి ఇంకా సంపూర్ణం కాలేదు
అది మనకోసం మిగిలే వుంది!
ఆయన స్ఫురద్రూపం, మాట, చూపు
కరచాలనం మననుండి దూరం కావచ్చు!
అప్పుడప్పుడు వినిపించే పలకరింపు
మళ్ళీ ఏనాడు మనకు వినిపించక పోవచ్చు!
ఆయన చేసిన త్యాగం, కృషి, సాధించిన ఫలితాలు
మన కళ్ళ ముందే నిలబడి ముందుకు సాగమంటున్నాయి!
ఆయన మన మీద వుంచిన విశ్వాసం
వెన్ను తడుతూనే వుంటుంది!
కష్టాలమయమైన జీవితం
ఆయన చిరునవ్వును ఓడించ లేక పోయింది!
అడుగడుగునా అడ్డంకులు
ఆయన నిబ్బరాన్ని జయించలేక పోయాయి!
ఆయన పదునైన కలం, మేధస్సు
ఆత్మ విశ్వాసం ముందు అన్నీ ఓడిపోయాయి!
నమ్ముకున్న ఆశయానికి అంకితమై
జీవితాంతం పరితపించాడు! పరిశ్రమించాడు!
జోహార్! కామ్రేడ్!
నీ యాదిలో నిరంతరం సాగుతాం!!
(కామ్రేడ్ టి.యన్.వి.రమణ స్మృతిలో)
-సత్య భాస్కర్, 9848391638