Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేడు ప్రపంచమంతటా అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా జరుపుకుంటారు. 1939లో సామ్రాజ్య విస్తరణ కాంక్షతో నాజీలను పొరుగు దేశాల మీదికి ఊసి గొల్పావాడు నియంత హిట్లర్. అప్పుడు వారు ఆక్రమించిన దేశం జకస్లొవెకియ. అక్కడ ప్రాజ్ నగరంలోని విశ్వవిద్యాలయంలోకి నాజీ సేనల ప్రవేశాన్ని విద్యార్థులు అడ్డుకున్నారు. తమ ప్రవేశాన్ని అడ్డుకున్న విద్యార్థుల మీద అత్యంత క్రూరంగా కాల్పులు జరిపి, పది మంది విద్యార్థి నాయకులను సంహరించి, మరో 1200 మందిని నాజీలు సృష్టించిన ''కాన్సంట్రేషన్ కాంప్'' అనే నరకంలోకి తరలించారు. ఆ దుర్ఘటన జరిగింది నవంబరు 17న. ఆ తర్వాత మూడేండ్లకు లండన్‌లో సమావేశమైన అంతర్జాతీయ విద్యార్థుల సమైక్య మండలి నాటి వీరోచిత విద్యార్థి పోరాటానికి, వారి బలిదానానికి గుర్తుగా నవంబరు 17ను అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవంగా జరపాలని తీర్మానించి అమలు చేస్తున్నది. ఆ విద్యార్థుల పోరాటాన్ని నాటి సొవియట్ యూనియన్ ఘనంగా నిర్వహించేది. ప్రపంచం దానిని అనుసరించేది. విద్యార్థి అనే పదానికి అసలు అర్థం చూస్తే డిగ్రీ కోసం కాక విజ్ఞానం కోసం తపించేవారంతా విద్యార్థులే అని ప్రపంచం నేడు అంగీకరిస్తోంది. వయసుతో సంబంధం లేదు కాబట్టి వయోజన విద్య పథకం మొదలయింది. ఎవరు ఏ వయస్సులో ఉన్నా విద్యర్థిగా ఆలోచించ వచ్చునన్నది. భావన. తెలివి సంపాదించడం, ఆది కూడా సక్రమమార్గంలో ఉండటం, కృషి, పట్టుదల, క్రమశిక్షణ మొదలైనవి ప్రతి విద్యార్థికి ఉండవలసిన లక్షణాలు. పెద్దలను గౌరవించడం, సమాజం పట్ల అవగాహన కలిగివుండటం విద్యార్థికి అదనపు లక్షణాలు. తాను నేర్చుకున్న విద్యను సక్రమమార్గంలో పెట్టి, విద్యార్జనకు అంతం లేదు అన్నది గ్రహించిన వాడే నిజమయిన విద్యార్థి. మానవ జీవితంలో ఈ దశ కీలకమయినది. క్రమశిక్షణతో చదువు అభ్యసించినప్పుడే ఉన్నత శిఖరాలను అధిరోహించడం జరుగుతుంది. విద్యార్థులు విద్యతో పాటు సంస్కృతిక, కళారంగాలలో రాణించాలి. నేడు విద్యార్థులు సినిమాలు, షికార్లతో కాలం వెల్ల తీస్తున్నారు. నిత్యం వాట్సాప్, పేస్బుక్, ఇన్స్టాగ్రాం, ట్విట్టర్లలో విహరిస్తున్నారు. దేశభక్తి సయితం సన్నగిల్లుతోంది. వస్త్రధారణ మార్చుకుంటూ, గడ్డాలు మీసాలు పెంచుకుంటూ విదేశీ సంస్కృతిని అలవాటు చేసుకుంటున్నారు. కాలేజీలకు డుమ్మా కొట్టడం, పార్క్, పబ్బులకు వెళ్లి టైం పాస్ చేయడం, విచ్చల విడిగా డబ్బులు ఖర్చు పెట్టడం, తల్లిదండ్రులను దూషించడం పరిపాటిగ మారింది. జల్సాలకు అలవాటు పడి పార్టీలు చేసుకోడం, తాగడం, తినడం, పేకాట ఆడటం, బెట్టింగ్ కట్టడం జరుగుతోంది. ఓపిక లేకుండా పోతోంది. వారికి నాయకత్వ లక్షణాలు లేకుండా పోతున్నాయి.
విద్యార్థులు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని దానిని చేరడానికి నిరంతరం కృషి చేయాలి. మహనీయుల గాథలు చదవాలి. వారి నుండి స్పూర్తి పొందాలి. సమాజ సేవ చేయడం అలవాటు చేసుకోవాలి. సమయ పాలన పాటిస్తూ ప్రతీ క్షణం విలువైనదిగా భావించాలి. సెల్ ఫోన్లకు దూరంగా ఉండాలి. ఈ దేశం గూర్చి ఆలోచించాలి. దేశ అభివృద్ధికి కృషి చేస్తాయాలి. ''ఈ దేశం నాకు ఏమి చేసింది అని కాక నేను ఈ దేశానికి ఏమిచేశాను'' అని ఆలోచించాలి. అప్పుడే ఏ దేశానికైనా పురోగతి.
(నేడు అంతర్జాతీయ విద్యార్థి దినోత్సవం)
- కమిడి సతీష్‌రెడ్డి
సెల్::9848445134