Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ వ్యవసాయ
కార్మిక సంఘ మహాసభకు
శ్రమైక్య శక్తులు కదలినరు
సబ్బండవర్గాలు తరలినరు
నల్ల చట్టాలు ప్రయోగించి
సాగుబాటుకు సమాధి కట్టే
దుష్ట పాలకులను గద్దెదించ
కర్షక దండు కదం తొక్కింది
పచ్చటి అడవిని చెరబట్టి
దోపిడీ మూకలకు కట్టబెట్టే
పెట్టుబడి తొత్తుల తొక్కిపెట్ట
ఆదివాసీల దళం హౌరెత్తింది
శ్రామిక శక్తుల అణగదొక్కి
బ్యూరోక్రాట్లకు వంతపాడే
బూర్జువా నేతల తరిమికొట్ట
కార్మికుల సైన్యం పోటెత్తింది
ఇపుడు లక్షలాదిగా చేరిన
కార్మిక కర్షకుల సందడితో
ఖమ్మం పట్టణం దద్దరిల్లింది
ఇంటింటా వాడవాడల్లో
అరుణారుణ తోరణాలు
ఎర్ర జెండాలు వెలిసినరు
పాటలు ప్రతిధ్వనిస్తున్నరు
ఓయి ప్రగతిశీల శక్తుల్లారా
ప్రజాస్వామ్యవాదులారా
సర్వజనులారా ఏకంకండోరు
అరుణ సభకు తరలిరండోరు
ఎర్ర జెండా ఎత్తి జైకొట్టండోరు
- కోడిగూటి తిరుపతి
9573929493