Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లవి : ఎవరి కోసం, ఎవరి కోసం...
ఈ సైబర్ కేఫ్, ఈ ఇంటర్నెట్
ఈ స్కైప్, ఈ వైఫై, ఈ వాట్సప్
ఈ జీబిల డాటా
ఎవరి కోసం ఎవరి కోసం
చరణం 1: ఫేస్బుక్ నువ్వే చూపెట్టి
చదువుకుంటున్న వాడిని చెడగొట్టి
'మిస్ కాల్' ఇవ్వలేని బిచ్చగాణ్ణి చేసావు
నువ్వు ఇవ్వంది దాచలేను
ఇంకా ఎవ్వర్నీ అడగలేదు
'కార్డు' నీకు ఇఛ్చాను
బ్యాంక్ ఖాళీ చేసావు !
చరణం 2: ఓర్వలేని ఈ ''పబ్'' ప్రళయంగా మారని
నా లవర్ లేని ఈ ''మల్టీప్లెక్స్''
తునాతునకలై పోనీ
కూలిపోయి బూడిదె మిగలనీ
చరణం 3: ''హగ్'' నాకు ఇమ్మన్నాను
''ప్లగ్'' దారి చూపావు !
''అరువు బైకు'' వాడనన్నాను
కారు వాడికి జెండా ఊపావు
నీకు ప్రేమ అంటే నిజం కాదు
నాకు ఖీదీ ఒక్కటే దిక్కు కాదు !
నీ ''వాల్ పేపర్'' తో తిరిగాను
వాల్కి సున్నం కొడుతూ మిగిలాను !
ఎవరి కోసం ఎవరి కోసం
- మూల వీరేశ్వరరావు
[email protected]