Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లవి : ఆ కుక్కే నిను చూసినది
ఈ వైపే నిను తరిమినది
నీకెందుకిలా అవుతుంది
ఆ కుక్క నడిగితే తెలిసింది
నువ్వే నువ్వే తనతోక లాగావంటూ
నిన్నే నిన్నే కరవాలి అంటున్నది
చరణం : దాన్నే తలచిన ప్రతి నిమిషం
నీలో తెలియని అసహనం
గడపే దాటిన మరు నిమిష
ఏమౌతుందని చిన్నభయం
బిస్కెటొకటి విసిరెయ్యాలి
నిన్ను తరుముతుంటే
రాయి పట్టి బెదిరించాలే.
నీ వెంట.. అదిపడుతుంటే..
నువ్వే నువ్వే తనతోక లాగావంటూ
నిన్నే నిన్నే కరవాలి అంటున్నది
(ఆ కుక్కే నిను)
చరణం : కుక్క కాటుతో వచ్చె రోగం
చెప్పుదెబ్బతో మటుమాయం
ఇంకా తీరని సందేహం
ఆపైపోదాం చికిత్సాలయం
హచ్చు కుక్కను చూడనెలేదా
యాడు వస్తు వుంటే
కుక్క కూడ దోస్తైరాదా..
నీవెంటే.. ప్రేముంటే..
నువ్వే నువ్వే తనఫ్రేండు వౌతావంటూ
కుయ్యో మొర్రో నీతోనే అంటున్నది
(ఆ కుక్కే నిను)
''నువ్వు నాకు నచ్చావ్'' (2001) చిత్రంలోని
''నా చూపే నిను వెతికినది'' పాటకు పేరడి.
రచన ''సిరివెన్నెల సీతారామశాస్త్రి''.
- డా.బి.బాలకష్ణ,
994899783