Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లవి : పచ్చనోట్లు మేసేటి దున్న పోతోరు
నీ పళ్ళు రాలి పోతాయి ఉన్న చోటే (2)
పళ్ళు రాలితేముంది అయ్య బాబోరు
పెట్టుడుపళ్ళు కట్టించుకుంట చూడు బాబారు(2)
చరణం : టేబుల్ మీద ఫైళ్ళెన్నో పేరుకున్నవీ
తమ బాధలు తీర్చమని అరుస్తున్నవీ
టేబుల్ మీద ఫైళ్ళెన్నో పేరుకున్నవీ
తమ బాధలు తీర్చమని అరుస్తున్నవీ
అర్జీలన్నీ చూడటం మనవల్లకానిది
లంచమెవడు ఇస్తడో ఆ ఫైలుకదుల్తది
అర్జీలన్నీ చూడటం మనవల్లకానిది
లంచమెవడు ఇస్తడో ఆ ఫైలుకదుల్తది
(పచ్చనోట్లు)
చరణం : లోకమంత నీ తీరు చూస్తున్నది
లంచగొండి నువ్వనీ అంటున్నది
కడుపు కాలిందంటే నీపైనపడ్తది
బొమికలల్లో సున్నాన్ని రాలగొడ్తది
బల్లకింద చేయి నాకలవాటైనది
లంచం పుచ్చుకోలేదంటే దురదపెడ్తది
దున్నపోతు మీద వర్షం ఏ పాటిది
మంచి చెప్పబోతే నీ పెడచెవిన పెడ్తివి
(పచ్చనోట్లు)
చరణం : పేదలకే బతుకు భారమౌతుంటది
లంచాలు వెండికంచాలు వాళ్ళకేడివి
సర్కారీ నౌకరేమో నీకున్నది
సాయం చేసే గుణముంటే మంచిగుంటది
గడ్డి మేసే గుణమెమో నాకున్నది
నా అడుగుఅడుగులో కూడా అడుసున్నది
రొంపిలోన ఈ బతుకే హాయిగున్నది
ఏ గంగకూడా దీనిని కడగకున్నది
(పచ్చనోట్లు)
''దసరాబుల్లోడు'' చిత్రంలోని
''పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్ల''
పాటకు పేరడి.
రచన: ''ఆచార్య ఆత్రేయ''
- డా. బి. బాలకష్ణ,
సెల్: 9948997983