Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లవి : ఎవరి కోసం - ఎవరి కోసం
ఈ చిత్ర ప్రపంచం ఈ విచిత్ర విలాసం
ఈ బాలి హుడ్డు ఈ టాలీ హుడ్డు
ఎవరి కోసం - ఎవరి కోసం
ఎవరి కోసం - ||ఎవరి||
చరణం : సిన్మా లన్నీ మీరే తీసి... మీ వాళ్ళనే హీరోలు చేసి
పెద్దపెద్ద సిన్మలన్నీ మీవాళ్ళకే అంటగట్టి
మీయంతటి నటుల్లేరు
ఇంకెవ్వరినీ ఎదగనీరు
ప్రజ్ఞ నంత తొక్కారు ప్రతిది మీరే నొక్కారు ||ఎవరి||
చరణం : స్వార్థబుద్ధి మీ గుణాలు నిస్వార్థంగా మారని
మనస్పర్థల్లేని సినిఫీల్డు సరికొత్తగ వెలవని
ఛాన్సులకై తిరిగిన రోజుల్తల్చుకోండి
మీలాగే ఇతరులనీ గ్రహించండి ... ||ఎవరి||
చరణం : ప్రతిభ చూడమన్నాము, బంధుప్రీతి చూసుకున్నారు
నటన దైవమన్నాము, నటులు దేవులన్నారు
మీకు సిన్మంటే వ్యాపారము
మాకు సిన్మంటే మరో వేదము
మార్నింగ్ షోకై కలబడతాము
లేకుంటే సెకండ్ షోలో
నిలబడతాము ||ఎవరి||
(దేవదాసు చిత్రంలోని ఆత్రేయ రాసిన
ఎవరి కోసం పాటకు పేరడి)
డా|| బి.బాలకష్ణ,
9948997983.