Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లవి : నేతల్లారా కోతల్లారా ఎక్కడమ్మా బ్లాక్మనీ
తెస్తరనీ దులుపుకొస్తరనీ ఎదురుచూసాం కదండీ
వెళ్ళివచ్చారా స్విస్సుబ్యాంకుకి
తీసుకొచ్చారా నల్లడబ్బునీ
జైజై నేతా జైజై నేతా జైజై నేతా జైజై నేతా
చరణం : మిడిల్ క్లాసులో క్లాసాయే, హై క్లాస్ది హైరేంజాయే
మిడిల్ క్లాసులో క్లాసాయే, హై క్లాస్ది హైరేంజాయే
నేతన్నా ఎటుబోతివే
పేదోడు నిరుపేదాయే, నిరుపేద కడుపేదాయే
కనువిప్పి ఇటుజూడవే
తన్ననన్నతాననా తన్ననన్నతాననా
నేతన్నా ఎటుబోతివే కనువిప్పి ఇటుజూడవే
వోట్లడిగే వేళాయే ఇళ్ళన్నీ తిరగాలే
వోట్లడిగే వేళాయే ఇళ్ళన్నీ తిరగాలే
పేదల బత్కులుచూడా గల్లీగల్లికి రావే
దండమెట్టమా దండిమనిషికి
వెళ్ళివచ్చారా స్విస్సుబ్యాంకుకి
జైజై నేతా జైజై నేతా
చరణం : ముష్టిమెతుకులేల మందుసీసాలేల
అవినీతి ఆపరా మమ్మేలే సామీ
ఒట్టిమాటలేలనే గట్టిమేలుచేయవే
అవి నీతి ఆపితే నీకు చెయ్యేత్తి జైకొట్టునే
నాదినీదనుటేలే మనదిమనమనలేమా
అమ్మ దేశమందరిదీ ఒకటేలే నీతి
బంధుప్రీతేలనే నల్లబాజారేలనే
మచ్చ లేని లీడరే మమ్ము కమ్మంగ పాలించునే
చిన్నిచిన్ని కన్నుల్లో ఎన్నివేల ఆశల్లో
మంచిచేసే లీడరొస్తే మారిపోవు కడగళ్ళో
అమ్మలాలపైడి కొమ్మలాల ఏది ఏవయ్యింది
అంతులేదియ్యాల కోట్లరూపాయల ఆ స్కాముగోల
గోవులాల పిల్లంగోవులాల గొల్లభామలాల
యాడనుంది ఆలనాటి ప్రగల్భల ఆసామిలీల
జాడచెప్పరా నల్లడబ్బుది
వెళ్ళవస్తారా స్విస్సుబ్యాంకుకి
జైజై నేతా జైజై నేతా
''ఆపద్బాంధవుడు'' (1992)చిత్రంలోని ''చుక్కల్లా చూపుల్లారా'' పాటకు పేరడీ.
రచన : సిరివెన్నెల సీతారామశాస్త్రి
- డా.బి.బాలకష్ణ,
994899783