Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భూమినీ, సముద్రాన్నీ రాజు పరిపాలించవచ్చు గాక
డాబు దర్పంతో ప్రభువు జీవించవచ్చు గాక
సైనికుడు ఠీవితో సాగొచ్చు గాక
నావికుడు సముద్రాన్ని చుట్టి రావొచ్చు గాక
అది కావొచ్చు ఇది కావొచ్చు
ఎవరు ఏమైనా కావొచ్చు గాక
అయితే, వీరందరికీ బువ్వ పెట్టేది రైతు
రచయిత ఆలోచించవచ్చు
కవి గానం చెయ్యవచ్చు
శిల్పి అద్భుతమైన కళాఖండాలు శిల్పించవచ్చు
వైద్యురాలు స్వస్థత చేకూర్చవచ్చు
న్యాయవాది ఉద్వేగంగా వాదించవచ్చు
లేత వయసుకే పెద్ద అవకాశం దొరకవచ్చు
ఎవరు ఏమైనా కావొచ్చు గాక
అయితే, వీరందరికీ బువ్వ పెట్టేది రైతు
వ్యాపారి కొనవచ్చు అమ్మవచ్చు
ఉపాధ్యాయిని తన బాధ్యతను చక్కగా నెరవేర్చవచ్చు
మనుషుల రోజులన్నీ కష్టాల్లో ఉండొచ్చు
లేదా సంతోషంలో గడపొచ్చు
రాజు నుంచి పేద దాకా
ఎవరు ఏమైనా కావొచ్చు గాక
అయితే, వీరందరికీ బువ్వ పెట్టేది రైతు
రైతు శ్రమ ఎంతో ప్రశస్తమైనది
ఆకాశం, భూమితో అతని పచ్చిక బయళ్ళు
ఎండా వానతో అతని పచ్చిక బీళ్లు
అంతేగాదు,
అతను పొందిన దానికి ఎవరూ నష్టపోలేదు
మనుషులు లేవవచ్చు,పడిపోవొచ్చు గాక
అయితే, వీరందరికీ బువ్వ పెట్టేది రైతు
మన కోసం గోధుమలు,వరిని నాటి
పండ్లను,పాలను,మాంసాన్ని కనుక్కున్న మనిషికి
దేవుని ఆశీస్సులు
అతని జేబు నిండాలి
అతని హదయం వెలుగుతూ ఉండాలి
అతని పాడి పంటలన్నీ సమద్ది కావాలి
విత్తడానికి సిద్ధమైన అతని చేతులకు ఆశీస్సులు
రైతుకు ఆశీస్సులు
అతను మనకందరికీ బువ్వ పెడుతున్నాడు
(ది ఫార్మర్ - ఇంగ్లీష్ కవితకు స్వేచ్ఛానుసరణ)
- కపాకర్ మాదిగ, 9948311667