Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంచి క్యాలెండర్
రాము : కాస్త్త మంచి క్యాలెండర్ ఇవ్వండి.
షాపు యజమాని : మంచి క్యాలెండరంటే అందమైన బొమ్మలున్నదా?
రాము : కాదు... స్కూలుకి సెలవులెక్కువ వచ్చే ఎరుపు రంగు గళ్ళున్న క్యాలెండర్.
యాక్సిడెంట్
తండ్రి : ఆడపిల్లలు పక్కనుంటే ఫోజుకోసం ఒంటిచేతితో కారు నడపకు.
కొడుకు : అలా నడిపితే యాక్సిడెంట్లు అవుతారు కదా నాన్న..?!
తండ్రి : కాదురా బుద్ధిలేని వెధవా..! నాలా నీకు పెళ్ళైపోతుంది..!
నాన్న వద్దు
చింటూ : అమ్మా! ఇకమీదట ట్యూషన్ నుండి నన్ను తీసుకురావడానికి నాన్నను పంపకు.
తల్లి : ఎందుకు పంపొద్దు?
చింటూ : మా మిస్ దగ్గర్నుండి నాన్నను తీసుకుని రావడానికి నేనెన్ని కష్టాలు పడుతున్నానో నీకు తెలియదమ్మా.
గొప్ప మనసు
రవి : ఇన్నాళ్లూ నువ్వు ఒక రాతి మనిషివి అనుకున్నాను. కానీ నీ మనసులో మనుషుల పట్ల ఇంత కరుణ ఉందని తెలియదు మిత్రమా! ఎవరో రోడ్డుమీద పోతున్న శవయాత్రకు కూడా మౌనం పాటిస్తున్నావంటే నీది చాలా కరుణాపూరితమైన మనసు..
జల్సారాయుడు : మరే! ఏదేమైనా, తను నాతో 30 ఏళ్లు కాపురం చేసిన మనిషి కదా! ఆ మాత్రం కరుణ కురిపించకపోతే ఎలా?
తాగితే...
శ్రీను : తాగినపుడు నువ్వు చాలా అందంగా వుంటావు రాణి.
రాణి :అవునా, కానీ నేను ఎప్పుడూ తాగలేదే'' అన్నది.
శ్రీను : నువ్వు కాదు డార్లింగ్... నేను తాగినపుడు.
దేశభక్తి
గోవిందం : మా వాడికి మార్కుల్లో ఎన్నిసార్లు సున్నాలొచ్చినా కొట్టడానికి వీలుకావడం లేదు.
ముకుందం : ఏం? ఎదురుతిరుగుతున్నాడా?
గోవిందం : కొట్టడానికి చేయెత్తినప్పుడల్లా జాతీయగీతం పాడుతున్నాడు. దాంతో సెల్యూట్ చేసి అటెన్షలో నిలబడాల్సివస్తుంది.
మౌనవ్రతం
రాజు : అతనేంటి పేరడిగితే ఏడు గుద్దులు గుద్ది ఆ కొండలవైపు చూపించి వెళ్ళి పోతున్నాడు?
సోము : ఓ.... అతనా! అతని పేరు ఏడుకొండలు. సోమవారం రోజున ఆయన మౌనవ్రతం లెండి, మాట్లాడడు.
అందుకే ఆలస్యం
టీచర్ : బడికి ఇవాళ ఆలస్యమయ్యిందేంటి.
విద్యార్థి : బడికి ఆలస్యంగా రానని.. వందసార్లు ఇంపోజిషన్ రాయమన్నారుగా. అది రాయటం వల్లే ఆలస్యం అయ్యింది.
మంచి పేరు
మొదటి వ్యక్తి : చెట్లను ఎందుకు కొట్టి వేస్తున్నారు?
రెండో వ్యక్తి : కొత్త మొక్కలు నాటి మంచిపేరు తెచ్చుకుందామని.
మాట మీద...
నిర్మల : నాతో పెళ్లి కాకుంటే చస్తాను అన్నావు కదా..! మరి ఆ రమ్యను ఎలా చేసుకున్నావు?
రాజు : నేను మాట మీద నిలబడ్డాను. ఆమెను చేసుకుని రోజూ చస్తూనే వున్నాను నిర్మలా.
ఏదైనా ఉపయోగమే!
పేషెంటు : ఆపరేషన్ థియేటర్లో పూలదండ ఎందుకు పెట్టారండి.
నర్స్ : ఆపరేషన్ సక్సెస్ అయితే డాక్టర్గారికి వేయడానికి, ఫెయిలయితే నీకు వేయడానికి.
ఏమీ లేదనే
పూజ : నాలో ఏం చూసి ప్రేమిస్తున్నావు బుజ్జీ?
బుజ్జి : నీలో ఏమీ లేదనే ప్రేమిస్తున్నాను. ఉంటే నిన్నీపాటికి ఎవరో ఒకరు ప్రేమించేసి ఉండేవారు కదా.
మిగిలేది?
టీచర్ : వినోద్, 5-5 ఎంత?
టీచర్ ప్రశ్నకు వినోద్ మౌనంగా ఉంటాడు.
టీచర్ : సరే, విను. నీ దగ్గర ఐదు ఇడ్లీలు ఉన్నాయి. ఆ ఐదు ఇడ్లీలను నేను తీసుకున్నాను. అప్పుడు నీ వద్ద ఏం ఉంటుంది?
వినోద్ : సాంబర్, చట్నీ ఉంటుంది టీచర్.