Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స స మ ప స మ ప ని
మ ప స ని ప మ రి స రి
నన్ను వేధించే వెధవాయివి నువ్వేనని....
దారి కాసే ఆ దొగోడివి నువ్వేనని....
నాకు అనిపించింది... నమ్మకం కుదిరింది
అన్ని తెలిసొచ్చి... నీ గుట్టు రట్టయ్యింది
పల్లవి :
పడ్డావు నువ్వు బురదలో మరి.. దిగేకొద్ది లోతులే అది
పడ్డావు నువ్వు బురదలో మరి.. దిగేకొద్ది లోతులే అది
నిజంగా నిజంగా ఇలా ఆ పూటే పొరపాటుగా
చరణం :
ఈ ఇష్కులోన దాగి ఉంది మాయరోగము
తనవైపే నిన్ను లాగుతుంది మోహపాశము
ఒహొ..ఒహొ...ఒ..ఒ...
నీ చేతిలోనే దాగి ఉంది దాని కళ్ళెము
నువ్వు వదలగానే చూడకుంది మిట్ట పల్లము
ఒహొ..ఒహొ...ఒ..ఒ...
ఎప్పటికీ అదే స్థితి... దారుణమీ పరిస్థితి
ఎప్పటికీ అదే స్థితి... దారుణమీ పరిస్థితి
వలపు గుర్రమెక్కి పడితే విరిపోద్ది నడ్డీ (పడ్డావు నువ్వు)
చరణం :
మీ నాన్న రోజు చదువుతాడు తిట్ల దండకం
నీ బుద్ధి మారి బాగుపడితే ఎంతో సంబరం
ఒహొ..ఒహొ...ఒ..ఒ...
మా అన్నలిద్దరు చేస్తారు పోలీసుద్యోగం
కంటపడితే చూపుతారు వారి హస్తలాఘవం
ఒహొ..ఒహొ...ఒ..ఒ...
బతికుంటే బలుసాకు... ప్రేమంటే ఖతర్నాకు
బతికుంటే బలుసాకు... ప్రేమంటే ఖతర్నాకు
వయసులోన ఉన్నోళ్ళకు బాధ్యతయే క్షేమకరీ
(పడ్డావు నువ్వు )
''స్టూడెంట్ నెంబర్ 1''
చిత్రంలోని ''నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని''
పాటకు పేరడీ. రచన : చంద్రబోస్
- డా.బి.బాలకృష్ణ,
9948997983