Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పల్లవి: చిన్నా.. పెద్దా.. చూసారమ్మా
కరోన వస్తోంది
వస్తూ వస్తూ తనతో ఎన్నో
బాధలు తెస్తోంది
....//2//.....
చరణం: ఏమమ్మా మాస్కమ్మా
మూతి కాస్త మూస్తావా
హాండు వాష్ ఎదురెళ్ళి
వీడుకోలు చెబుతావా
ఒంటరిగా తనవెంట రారమన్నది
విన్నారమ్మా కరోన కోకిల
రమ్మను పిలుపుల్ని
చూసారమ్మా వైరసునంటే
కలిసిన చేతుల్ని
వారు వీరు అంటూ భేదం లేనేలేదు
ప్రతివారి ప్రాణాన్ని తీస్తదీ
తోడూ నీడా అంటూ నీతో నడిచిందంటే
ఏనాటి ఋణమైన పోతదీ
చేయి చేయి కలపకనే సాగితేనె వరమనీ
కాటువేసె దుర్బుద్ధి గుండెలోనె దాచుకొని
ప్రతి ఒక్కరూ తన చేతికే చిక్కాలనీ
కోరుకుంటుంది పాపిష్టిదీ.....
...చిన్నా..పెద్దా...
ఇదిగో నిన్నే అంటూ వైరస్ పిలిచిందంటే
ప్రాణాలు పోతాయి నింగికి..
నీతో జతగా ఉండే వరమే ఇచ్చావంటే
ఇంకేమి కావాలి దానికి...
కొమ్ములున్న వైరస్ ను
భయంతోన చూస్తున్నా
వరస గాని బంధువనీ
చొరవ చూపి చస్తున్నాఇంకెప్పుడూ ఒంటరిననే అంటాననీ
నీకు సొంతం అంటే ధైర్యమేననీ...
...చిన్నా.. పెద్దా...
...విన్నారమ్మా... చూసారమ్మా...
పేరడీ పాట: వెన్నెల సత్యం
చిత్రం పేరు: నువ్వొస్తావని
- వెన్నెల సత్యం, 9440032210