Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''అనుబంధం'' చిత్రంలోని
''ఆనాటి ఆ స్నేహం'' పాటకు పేరడి
రచన : ''ఆత్రేయ''
పల్లవి : హ హ హ.....
(ఫ్రెండ్1) : ఆనాటి ఆ క్రాఫు అందానికందం
తలనీలాలన్నీ మదులాతి మదులం
ఈనాడు ఆ జుత్తు లేదేల నేస్తం.
ఆ బొచ్చు మునుముందిక రాదేమిరా.. హ హ
లేదురా ఆ శిరోజం, రాదురా ఆ యౌవనం, ఏమిటో జీవితం
ఆరే ఫూల్ గుర్తుందిరా
జుంపాలు పెంచిన రోజులు, మాష్టారితో తిన్న తన్నులు
ఒకరి సిగలు ఒకరు పట్టుకుని
(ఫ్రెండ్2) :ఒరే ఒరే ఒరెరు పక్కనే
కోవిడ్ టైంలో పాసైన పిల్లలున్నారా
(ఫ్రెండ్1) :నేర్చుకుంటార్రా... హు హు.. హ్హ హ్హ హ్హ..
చరణం : నూనే మార్చలేదు. అమోనియా అంటలేదు
జుత్తే రాలిపోతే నేరం మనదేమి కాదు
మా తాత ఏ ఆస్తి నాకివ్వలేదు
అనువంశికంగా ఈ బట్టిచ్చినాడు
తిట్టేసుకుంటాను మా తాతను
విని నవ్వుకుంటాడు ఆ త్రాష్టుడు
ఆ సెలునులు.. ఆ స్టైలులు ఏమాయెరా
ఆ..ఆ..ఆ..
ఒరే రాస్కెల్ జ్ఞాపకముందిరా పెండ్లికని ఫ్రెండింటికి వెళ్తే
ఓ పేండ్లదండు మన తల్లోకి వలసొస్తే
గోకీ గోకీ నెత్తంతా పుండ్లు పుడితే
(ఫ్రెండ్2) : ఒరే ఒరే స్కౌండ్రల్ ఊరుకోరా అందరు వింటారు
(ఫ్రెండ్1) : వింటే వింటార్రా, తల్లో పుండ్లకు మందడిగి తెచ్చుకుంటారు
అంతే హుహుహహహ (ఆనాటి)
చరణం : యాడ్సే చూసినాను తైలం తెచ్చినాను
(ఫ్రెండ్1) : నెత్తికి పూసినాను బొచ్చుకై వేచినాను
నా గుండు మంటింక తగ్గేది కాదు
ఈ ఎండలో నేనెళితే తిరిగింక రాను
ఏ శాపమో నాకు తగిలిందిరా
రేరు! ఒక్కెంటుకే లేని గుండాయెరా
ఆ నల్లని ఆ కురులకు మందేదిరా
(ఫ్రెండ్2) : ఒరే.. ఒరే.. ఏమిట్రా పసిపాపలాగా
ఛ ఛ ఊరుకో
(ఫ్రెండ్1) : ఒరే ఈ బట్టకు తుది ఎక్కడ్రా
(ఫ్రెండ్2) : విగ్గుతో మేనేజ్ చేయడమేరా. ఉ హ్వహ్వహ్వ.
(ఫ్రెండ్1) : రియల్లీ దోస్ డేస్ ఆర్ ఫ్యాబులెస్
(ఫ్రెండ్2) : కరెక్ట్ రా.
- డా.బి.బాలకష్ణ, 9948997983