Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థుల ఆరోగ్యం, విద్యాబోధన, భోజన, వసతి సౌకర్యాలు సకాలంలో అందించడంతో పాటు నాణ్యత కలిగి ఉండాలని అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. శుక్రవారం స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ బాలికల జూనియర్ కళాశాల, గిరిజన సంక్షేమ శాఖ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న విద్యాబోధన తీరును తరగతి గదులలోకి వెళ్లి విద్యార్థులు చదువుతున్న తీరును, ఇప్పటి వరకు నేర్చుకున్న పాఠ్యాంశాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. చదువులో వెనకబడి ఉన్న విద్యార్థులపై అధ్యాపకులు ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని, సకాలంలో సిలబస్‌ను పూర్తిచేసి రివిజన్ చేయించాలని అన్నారు. వందశాతం ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యార్ధులు కష్టపడి చదువుకోవాలని అన్నారు. కళాశాలల్లోని విద్యార్థినిలు వారి భవిష్యత్తుకు లక్ష్యం ఏర్పరుచుకొని ఆ దిశగా చేరుకోవాలని అన్నారు. సమయానుకూలంగా పాఠ్యాంశాలను చదవడం ద్వారా లక్ష్యాన్ని చేరుకోవచ్చని అన్నారు. విద్యార్థులకు భోజన వసతులను అందించాలని, అనారోగ్యం బారిన పడిన విద్యార్థులకు వైద్య చికిత్సలు ఇప్పించాలని అన్నారు. వసతి గృహాల్లోని విద్యార్థులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఆయా యాజమాన్యాలు అధ్యాపక బృందం సత్వర చర్యలు పర్యవేక్షణ చేయాలని అన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలని అన్నారు. కిచన్, స్టోర్ రూమ్‌లను ఆయన పరిశీలించారు. కాలం చెల్లిన సరుకులను తిరిగి పంపిణీ దారులకు అందజేసి వాటి స్థానంలో కొత్త సరుకును తీసుకోవాలని అన్నారు. నాణ్యమైన గుడ్లను మాత్రమే విద్యార్థులకు మెనూ ప్రకారం అందించాలని అన్నారు. ఆయన వెంట జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్, పాఠశాల, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.