Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉట్నూర్
క్రీడల్లో రాణించే గిరిజన విద్యార్థులకు అన్ని విధాలుగా చేయుత నిస్తామని ఐటీడీఏ పీఓ వరుణ్ రెడ్డి అన్నారు. రాష్ట్ర స్టాయిలో ఖోఖో పోటీల్లో వెండి పథకాలు సాధించిన విద్యార్థులు నరేష్, నవీన్, నిఖిల్ లను పీఓ ఆదివారం ఐటీడీఏ పీఓ కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ ఈ నెల 30న లాతూర్లో జరిగే ఫోటీలలో ఈ గిరిజన విద్యార్థులు పాల్గొననున్నట్టు తెలిపారు. విద్యార్థులు ఇంతటితో ఆగకుండా మరిన్ని పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరుస్తూ తల్లిదండ్రులు, ఉపాద్యాయల కలలను నిజం చేయాలన్నారు. గిరిజన విద్యార్థులు చదువుతో పాటుగా క్రీడల్లో రాణించాలని పీఓ కోరారు. ఏటూరు నాగారం, జడ్చర్లలో నిర్వహించే పోటీల గురించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఐటీడీఏ డీడీ దిలీప్, జిల్లా గిరిజన క్రీడల అధికారి పార్థసారథి, పీడీలు హేమంత్, శ్రీనివాస్, రవీందర్, కోచ్లు పాల్గొన్నారు.