Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఏజీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రవికుమార్
నవతెలంగాణ-ఆదిలాబాద్ అర్బన్
పోడు భూముల సర్వే లో ఐటీడీఏ నోడల్ గా ఉండి సర్వే నిర్వహించాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టాగ్స్) ఉపాధ్యక్షులు బండారు రవికుమార్ అన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆ సంఘం (టాగ్స్) కార్యాలయంలో జిల్లా కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడు భూముల సర్వే సందర్బంగా ఫారెస్ట్ అధికారులు షాటి లైట్ సర్వే పేరుతో పోడు సాగుదారులకు భూమి అందకుండా కుట్రలు చేస్తున్నారన్నారు. సర్వే లో చట్టానికి భిన్నంగా గ్రామ సభలు నిర్వహించకుండా ఇష్టా రీతినా సర్వే చేపడుతూ పోడు సాగుదారులను భయ బ్రాంతులకు గురి చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. గుస్సాడి ఉత్సవాలకు ప్రభుత్వం అందిస్తున్న పారితోషికాన్ని రూ.25 వేలకు పెంచాలని అలాగే 10 శాతం రిజర్వేషన్ ను అందిస్తూ ఆ జీవోకి చట్ట బద్దత కల్పించాలని పేర్కొన్నారు. రాష్ట్రపతి, గవర్నర్ల ఆమోదం పొందేలా ప్రభుత్వాలు కషి చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన తెగల మధ్య ఉన్న అంతరాలపై బీజేపీ తన స్పష్టమైన వైఖరి ప్రకటించాలని అన్నారు. అన్ని పార్టీలను ఐక్యం చేసి ప్రతి తెగకు హక్కులు కల్పించేలా వర్గీకరణకు ఒప్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం (టాగ్స్) జిల్లా కార్యదర్శి పూసం సచిన్, ఉపాధ్యక్షులు లంకా రాఘవులు, మడావి నాగోరావ్, కనక నగేష్, సహాయ కార్యదర్శులు ఆత్రం కిష్టన్న, ఉయిక విష్ణు, కనక మల్కు, ఆత్రం తనుష్ పాల్గొన్నారు.