Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాగజ్‌నగర్
గురుకులాలు, వసతిగృహాలలో పరిసరాల పరిశుభ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న శిక్షణ శుక్రవారంతో ముగిసింది. మండలంలోని బలగల మైనార్టీ గురుకులంలో ఈ శిక్షణ నిర్వహిస్తున్నారు. మొదటి రోజు 200 మంది హెడ్ కుక్‌లు, అసిస్టెంట్ కుక్‌లకు శిక్షణ ఇవ్వగా, రెండో రోజు 95 మంది డిప్యుటీ వార్డెన్లు, వార్డెన్లకు, మూడో రోజు 47 మంది ఎఎన్ఎంలకు, నాలుగో రోజు 74 మంది ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు, స్పెషల్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. తక్కువ నాణ్యత కలిగిన ఆహార పదార్థాలను గుర్తించి వాటిని వినియోగించకపోవడం, కలుషిత నీరు. శుభ్రత అంశాలపై శిక్షకులు జబ్బార్ వివరించగా, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రీజనల్ లెవల్ కో ఆర్డినేటర్ పుష్పలత శిక్షణ ఇచ్చారు. ఆహార పదార్థాల తయారీ తేది, గడువ తేదీని చూసి వాడే అంశంపై జిల్లా కో ఆర్డినేటర్ సత్యనారాయణమూర్తి వివరించారు. వ్యాధుల నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డిప్యుటీ డీఎం అండ్ హెచ్ఓ సీతారాం, హెల్త్ అధికారులు వెంకటేశ్వర్లు, సునీత వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అభివృద్ది అధికారి షేక్ మహమూద్, కో ఆర్డినేటర్ సత్తయ్య, మైనార్టీ గురుకుల బాలుర పాఠశాల ప్రిన్సిపల్ షగుప్తా, వార్డెన్ రవిచంద్ర పాల్గొన్నారు.