Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆదిలాబాద్‌అర్బన్
జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మునికి ఘననివాళులర్పించారు. పట్టణంలోని స్థానిక గాంధీచౌక్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మున్సిపల్ చైర్మెన్ జోగు ప్రేమేందర్ ముఖ్యఅతిథిగా పాల్గొని గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మాజీ భారత ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటానికి పూలమాలలు వేసి వారి త్యాగాలను స్మరించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత స్వాతంత్ర పోరాటంలో ముందుండి అహింస, శాంతి మార్గాలలో ప్రజాస్వామ్య బద్ధంగా ఉద్యమించిన నేత మహాత్మా గాంధీ అన్నారు. గాంధీజీ సారధ్యంలో స్వాతంత్రాన్ని సాధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో వజ్రోత్సవాలను నిర్వహించుకున్నామని గుర్తు చేశారు. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సామాజిక వర్గాల అభివృద్ధి వంటి ఆయన సిద్ధాంతాలను రాష్ట్ర ప్రభుత్వం స్ఫూర్తిగా తీసుకొని పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలను చేపట్టిందన్నారు. అందులో భాగంగానే మొక్కలను పెంచుతూ గ్రీనరీ పార్కులు ఏర్పాటు చేస్తూ అహ్లాదకర వాతావరణాన్ని తయారు చేసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అజరు, మున్సిపల్ కమిషనర్ శైలజ, గుండావార్ సంతోష్, ఆర్యవైశ్య అధ్యక్షులు జవ్వాజి ప్రకాష్, విశ్వంబర్, కొత్తవార్ రాజేశ్వర్, కృష్ణ, ప్రవీణ్, శివకుమార్, ప్రసాద్ పాల్గొన్నారు.