Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లక్షెట్టిపేట్
న్యాయవాద వృత్తిలో న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు బార్ కౌన్సిల్ కృషి చేస్తోందని తెలంగాణ బార్ కౌన్సిల్ సీనియర్ సభ్యుడు కాసుగంటి లక్ష్మణ్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన లక్షెటిపేట కోర్టుకు వచ్చిన సందర్భంగా బార్ అసోసియేషన్ హాలులో న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ న్యాయవాదులతో పలు అంశాలపై చర్చించారు. అనంతరం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో లక్ష్మణ్‌కుమార్‌కు పుష్పగుచ్ఛాలతో శుభాకాంక్షలు తెలియజేశారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడికొప్పుల కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యలను లక్ష్మణ్ కుమార్‌కు విన్నవించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు గడికొప్పుల కిరణ్ కుమార్, ఏజీపీ పద్మ, ఉపాధ్యక్షుడు గాండ్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ఎస్. ప్రదీప్ కుమార్, న్యాయవాదులు రాజేశ్వరరావు, గోవింద్ రావు, అక్కల శ్రీధర్, మేదరి పాల్సన్ కుడెల్లి అశోక్, చాతరాజు శివశంకర్,ఎండి తాజోద్దిన్, రవిరాజ్, సంజన పాల్గొన్నారు.