Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆసిఫాబాద్
జిల్లా కేంద్రంలో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు అశోక్ డిమాండ్ చేశారు. సంఘం తరఫున శుక్రవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్రలో లక్ష్మణ్ బాపూజీ సేవలు వెలకట్టలేనివన్నారు. అటువంటి వ్యక్తి జిల్లాకు చెందిన వాడు కావడం అందరికీ గర్వకారణం అని తెలిపారు. జిల్లా కేంద్రంలో బాపూజీ భవనం నిధులు లేక అసంపూర్తిగా ఉండిపోయిందన్నారు. వెంటనే భవనం ఏర్పాటు కోసం రెండు ఎకరాల స్థలం కేటాయించడంతో పాటు అవసరమైన నిధులు మంజూరు చేయాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో మండల అధ్యక్ష, కార్యదర్శులు కోమటిపల్లి లింగయ్య, శ్రీకాంత్, నాయకులు కోట వెంకన్న, రాజు ఉన్నారు.