Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-కాసిపేట
కాసిపేటలో గురుకుల పాఠశాల భవన నిర్మాణం మంజూరు, గిరిజన కళాశాల మంజూరు కొరకు ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయంతో కషి చేస్తానని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామిచ్చారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాల భవనాన్ని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు వెంకటేష్ నేత, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, విద్యాశాఖ కార్యదర్శి కరుణ, కలెక్టర్ భారతిహోలికేరీ, ఆదర్శ పాఠశాలల చైర్మెన్ శ్రీధర్రెడ్డిలతో కలిసి ప్రారంభించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరలు, నూతన పింఛన్కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ముందుగా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ బెల్లంపల్లి నియోజకవర్గంలో ఏడు గురుకుల పాఠశాలలు నడుస్తున్నట్లు పేర్కొన్నారు అందులో ఒకటి కాసిపేట గురుకుల పాఠశాల స్థలభావంతో బెల్లంపల్లిలో కొనసాగుతోందని వివరించారు. ఇప్పుడు ప్రభుత్వం స్థలం కేటాయించినప్పటికీ భవనిర్మాణ మంజూరుకు సుమారు రూ.30 కోట్లు మంజూరు చేయించాలని, అలాగే కాసిపేట ఏజెన్సీ మండలం గిరిజన ప్రాంతం కనుక ఇక్కడి విద్యార్థులు సుమారు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉట్నూర్ వెళ్లి చదువుకోవడానికి ఇబ్బందుల కు గురవుతున్నారని తెలిపారు. కనుక ఇక్కడ గిరిజన కళాశాలను మంజూరు చేయించాలని విద్యాశాఖ మంత్రిని కోరారు. అనంతరం విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభివద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఓ శేషాద్రి, బెల్లంపల్లి ఆర్డీఓ శ్యామల, ఎంపీపీ రోడ్డ లక్ష్మీ, జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్రావు, పార్టీ మండల అధ్యక్షుడు రమణారెడ్డి, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ నాగమల్లయ్య, ఉపాద్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.