Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నార్నూర్
పేద ప్రజల అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని జెడ్పీ చైర్మన్ జనార్ధన్ రాథోడ్ అన్నారు. శుక్రవారం మండలంలోని మలెంగి, మాలేపూర్, ఉమ్రి గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న దసరా కానుకగా ఆడపడుచులకు బతుకమ్మ చీరలు, ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల ఇంట ఆడపడుచులు చిరునవ్వుతో ఉండాలని దసరా కానుకగా బతుకమ్మ పండుగకు చీరలను ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ సింగారే కిషన్, ఎంపిపి కనక మోతుబాయి, వైస్ ఎంపిపి చంద్రశేఖర్, ఎంపీడీఓ రమేష్, తహసీల్దార్ లక్ష్మణ్, నాయకులు కనక ప్రభాకర్, మర్సుకోల తిరుపతి, డిపిఎం శేషేరావ్, నరేందర్, ఏపిఎం రమేష్, సర్పంచులు రూపాబాయి గోపాల్, పవార్ ఇందల్, రాథోడ్ రవీందర్, సీసీలు సంతోష్, కిషన్, సత్యశీల, శ్రీరాం, రేవయ్య పాల్గొన్నారు.