Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాగజ్నగర్
అసలే వర్షాకాలం. పైగా గత కొన్ని రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు. వరద నీరు వెళ్లేందుకు సరైన మురికి కాలువల సౌకర్యం లేదు. ఇంకేముంది. ఎక్కడి నీరు అక్కడే నిల్వ ఉండి వ్యాధులు ప్రబలేందుకు కారణమవుతోంది. పట్టణంలోని ఆర్ఆర్ఓ కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాలలో ఒకటో తరగతి నుండి ఐదో తరగతి వరకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పాఠశాల చుట్టూ పెద్ద మొత్తంలో వరద నీరు నిలిచి ఉంది. గత కొన్ని రోజులుగా ఈ నీరు నిలిచి ఉండడంతో పచ్చగా మారి దుర్వాసన వేస్తోంది. ఈ నీటి మధ్యలోనే పాఠశాల ఉండడం, చిన్న పిల్లలు కావడంతో వ్యాధులు ప్రబలే అవకాశముందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీని పక్కనే మున్సిపాలిటీ ఆధ్వర్యంలో బస్తీ దవాఖానా నిర్మించారు. ఇది ఇంకా ప్రారంభానికి నోచుకోకపోయినా దీని చుట్టూ కూడా పెద్ద మొత్తంలో వరద నీరు నిలిచి ఉంది. అధికారులు స్పందించి నీరు నిల్వ లేకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.