Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లక్షెట్టిపేట్
తెలంగాణ ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత అన్నారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల, వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో బతుకమ్మ చీరల పంపిణీలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పండుగ రోజున మహిళలందరు ఆనందంగా ఉండాలనే రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు చీరలను అందిస్తుందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఆడపడుచులందరికీ బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తుందన్నారు. అంతేకాకుండా కళ్యాణలక్ష్మి, ఆసరా పింఛన్లు, 24 గంటల ఉచిత విద్యుత్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇలాంటి పథకాలను గత ప్రభుత్వాలు ప్రవేశపెట్టకపోగా ఇప్పుడు కెసిఆర్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలను చూసి ఓర్వలేక అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. అనంతరం ఎమ్మెల్యే దివాకర్‌రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తుందని తెలిపారు. కరోనా కాలంలో కూడా ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి, సంక్షేమ పథకాన్ని నిలిపివేయలేదని పేర్కొన్నారు. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తెలంగాణ ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుందన్నారు. ఇటిక్యాల్‌లో 1250 మందికి బతుకమ్మ చీరలు అందించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నడిపల్లి ట్రస్ట్ చైర్మన్ విజిత్‌రావు, మున్సిపల్ చైర్మన్ నల్మాస్ కాంతయ్య, వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్‌గౌడ్, డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగయ్య, మాజీ డీసీఎంస్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కేతిరెడ్డి సంధ్య జగన్మోహన్రెడ్డి, ఇన్చార్జి తహసీల్దార్ సనత్ కుమార్, కౌన్సిలర్లు గడికొప్పుల ఉమాదేవి, సురేష్ నాయక్, గొడిసెల లక్ష్మీ, సాయిని సుధాకర్, రాందేని వెంకటేశ్, సువర్ణ, నాయకులు వెంకట్‌స్వామి గౌడ్, సుమన్, బాణాల రమేష్ పాల్గొన్నారు.