Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జైనథ్
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం పీఆర్టీయూతోనే సాధ్యమని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు కొమ్ము కృష్ణ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి కుడాల రవీందర్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని పార్డి, సుందరగిరి, మాంగుర్ల, వివిధ పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత్ పరిషత్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు సిందె విజరు కుమార్ పీఆర్టీయూలో చేరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు సంబంధించిన షెడ్యూల్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మోడల్ స్కూల్, కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు వెంటనే బదిలీలు చేపట్టాలి. ప్రతి పాఠశాలలో స్కావెంజర్ పోస్టును భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. జీఓ 317 సమస్యలు తొలగించడానికి పీఆర్టీయూ కృషి చేస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష సిమర్ల నర్సయ్య, రాష్ట్ర అసోసియేట్స్ అధ్యక్షులు మధుసూధన్, వెంకట్ రమణ పాల్గొన్నాడు.