Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కంట్రోల్ బోర్డ్ సంచాలకులు
నవతెలంగాణ-కాసిపేట
మందమర్రి ఏరియా కాసిపేట గనిని శుక్రవారం తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ నిజామాబాద్ రీజనల్ సంచాలకులు లక్ష్మణ్ ప్రసాద్ సందర్శించారు. ఈ సందర్బంగా పర్యావరణ అనుమతుల రీత్యా ప్రస్తుతం 0.18 మిలియన్ టన్నుల ఉత్పత్తి నుంచి 0.54 మిలియన్ టన్నుల ఉత్పత్తి వరకు పెంచుటకు పర్యావరణ అనుమతులకు సింగరేణి యాజమాన్యం తీసుకుంటున్న చర్యలకు వారు సంతృప్తి వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణ చర్యలలో భాగంగా యాజమాన్యం అభివృద్ధి పనులు, మొక్కల పెంపకంపై అధికారులను అభినందించారు. కంట్రోల్ బోర్డ్ సంచాలకులు లక్ష్మణ్ ప్రసాద్‌తో పాటు కాసిపేట గ్రూప్ ఏజెంట్ కుర్మ రాజేందర్, ఏరియా ఎన్వీరాన్మెంట్ అధికారి ప్రభాకర్, గని మేనేజర్ అల్లావుద్దీన్‌లు పాల్గొన్నారు.