Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి
నవతెలంగాణ-మంచిర్యాల
జిల్లాలో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులను అధిక ఫీజులతో దోపిడీకి గురి చేస్తున్నాయని, సంబంధిత కళాశాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ మంచిర్యాల జిల్లా శాఖ కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి డిమాండ్ చేశారు. శనివారం డీఐఈఓకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద మధ్య తరగతి విద్యార్థుల వద్ద కార్పొరేట్, మినీ కాలేజీల ప్రైవేటు యజమాన్యాలు విద్యార్థుల దగ్గర అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. చదువులు పూర్తయిన తర్వాత కూడా టీసీలు ఇవ్వమంటూ, విద్యార్థి తల్లిదండ్రులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. ఫీజు డబ్బులు చెల్లిస్తేనే టీసీలు ఇస్తామని యజమాన్యాలు మొండికేయడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. పేద మధ్యతరగతి విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కళాశాలల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు అండగా ఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తోందన్నారు. కార్యక్రమంలో సంతోష్, కుమార్, శ్రీకాంత్ పాల్గొన్నారు.