Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆదిలాబాద్టౌన్
తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులు విజయవంతం అయ్యాయని తెలంగాణ ఆదివాసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శి పూసం సచిన్ తెలిపారు. శనివారం ఆదిలాబాద్ చేరుకున్న ఉమ్మడి జిల్లా టీఏవీఎస్ నాయకత్వం విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 21, 22, 23 తేదీల్లో హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక శిక్షణ తరగతులు నిర్వహించి, ఆదివాసీ విద్యార్థులకు వైజ్ఞానిక చైతన్యం, ఆదివాసీల అభివృద్ధి అనే అంశాలపై 3 రోజుల పాటు శిక్షణ ఇచ్చినట్టు పేర్కొన్నారు. గిరిజన విద్యారంగ సమస్యలపై భవిష్యత్ కార్యాచరణ రూపొందించినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 1200 మంది విద్యార్థులు ఈ శిక్షణ తరగతులకు హాజరైనట్టు వెల్లడించారు. కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసీ విద్యార్ధి సంఘం జిల్లా అధ్యక్షులు భైరి సోమేశ్, కార్యదర్శి ఆత్రం కిష్టన్న, ఉపాధ్యక్షులు అర్జున్, ఈశ్వర్, పుష్పలత, నగేష్, అవినాష్, ఉయిక విష్ణు పాల్గొన్నారు.