Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆదిలాబాద్టౌన్
పట్టణంలో బతుకమ్మ సంబురాలు ముందుగానే ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శనివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విద్యార్థి విద్యాసంస్థల ఆధ్వర్యంలో ముందస్తుగా వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థినులు మాట్లాడుతూ తొమ్మిది రోజుల శరన్నవరాత్రి లాగే బతుకమ్మ పండుగ వేడుకలు నిర్వహించుకుంటామని అన్నారు. బతుకమ్మ పండుగతో స్నేహితులతో కలిసి కోలలు ఆడటం ఎంతో ఆనందదాయకంగా ఉందన్నారు. విద్యార్థుల కేరింతలు, నృత్యాలు, చప్పట్ల మధ్య ఘనంగా నిర్వహించుకున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి ఆడిపాడారు. కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సుహాసినిరెడ్డి, విద్యార్థి విద్యా సంస్థల చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, మీనా, విద్యార్థులు ఉన్నారు.
తాంసి:బతుకమ్మ సంబరాల్లో భాగంగా శనివారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాధమిక పాఠశాలలో విద్యార్థులు బతుకమ్మ సంబురాలు ఘనంగా నిర్వహించుకున్నారు. వివిధ రకాల రంగురంగుల పూలతో విద్యార్థినులు బతుకమ్మలను తయారు చేసి, పాఠశాల అవరణలో బతుకమ్మ పాటలకు కొలలు వేస్తూ నృత్యాలు చేశారు. అనంతరం గ్రామ సమీపంలోని వాగులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శివాజీ, సత్యనారాయణ, గ్రామస్తులు ఉన్నారు.
దిలావర్పూర్:మండల కేంద్రంలోని విజేత స్కూల్, జడ్పిఎస్ఎస్ పాఠశాల, సిర్గాపూర్ ఫేయర్ స్కూల్ తదితర పాఠశాలల్లో విద్యార్థులచే ముందస్తు బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. సంస్కతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ దేవీదేవతలను పూజించే తీరొక్క పూవులతో పేర్చి కొలిచారు. బతుకమ్మ సంబరాల్లో విద్యార్థుల నత్యాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమాల్లో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.