Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు
నవతెలంగాణ-గుడిహత్నూర్
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు, ఆడపడుచుల ఔన్నత్యానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను ప్రజలందరూ సంతోషంగా నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు. ఆదివారం మండలంలోని సీతాగోంది రైతు వేదికలో బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం చీరల పంపిణీ చేస్తోందన్నారు. పల్లెల్లో పుట్టి రాష్ట్రానికే పరిమితం అయిన బతుకమ్మ పండుగ నేడు విశ్వవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఇది మనకు ఎంతో గర్వకారణమని అన్నారు. పేదింటి ఆడపిల్లలకు కల్యాణ లక్ష్మి పథకం కింద రూ.లక్షా116 ఆర్థికసాయం చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం వితంతువులు, వికలాంగులకు ఆసరా పింఛన్లు, అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సంద్యారాణి, ఎంపీడీఓ సునీత, సర్పంచ్‌లు ధనలక్ష్మి, ప్రేమలత, మాన్కు, నీలాబాయి, లక్ష్మణ్, ఎంపిటీసీలు కృష్ణవేణి, షగీర్ ఖాన్, కోఆప్షన్ సభ్యుడు జమీర్, టీఅర్ఎస్ కన్వీనర్ కరాడ్ బ్రహ్మనంద్, నాయకులు బూర్ల లక్ష్మీనారాయణ, సంతోష్ గౌడ్, రమేష్ జాదవ్, పాటిల్ రాందాస్, జమీల్, అశన్న, దీలీప్, మహిళలు పాల్గొన్నారు.