Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జన్నారం
మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు గుడ్ల రాజన్న అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో మండల స్థాయి వ్యవసాయ కార్మిక సంఘ సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటి స్థలం ఉన్న పేదలకు రూ.5 లక్షల వ్యయంతో నూతన ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. పోడు భూమి సాగు చేసుకుంటున్న పేద రైతులకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో అర్హులైన వారికి పింఛన్లు అందించడంలో అవకతవకాలు జరిగాయన్నారు. వాటిని సరిచేసి అర్హులైన వారికి పెన్షన్లు అందించాలన్నారు. ఈనెల 28వ తేదీన మండల స్థాయి వ్యవసాయ కార్మిక సంఘం సభను ఇంధన్పల్ల్లి గ్రామంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సభకు వ్యవసాయ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అశోక్, బుచ్చయ్య రాజన్న, జయ, ప్రమీల, అంజయ్య పాల్గొన్నారు.