Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాసిపేట
మండలంలోని మల్కేపల్లి గ్రామంలో ఐటీడీఏ సీసీడీపీ నిధుల నుంచి రూ.12 లక్షలతో తోటి గిరిజనులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి పనులను ప్రారంభించారు. ఈ సంధర్భంగా ఎంపీపీ రొడ్డ లక్ష్మీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రమణారెడ్డి మాట్లాడుతూ గతంలో చూస్తే గిరిజన ప్రాంతాలు ఏ మాత్రం అభివృద్ధి, సంక్షేమాన్ని పట్టించుకోలేదని, తెలంగాణ వచ్చాక మారుమూల గిరిజన గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుడ్మేత లక్ష్మీ, సహకార వైస్ చైర్మన్ శంకర్ గౌడ్, ఉప సర్పంచ్ ఆడి జనార్ధన్, టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు సల్లూరి ప్రభాకర్, నాయకులు సిడం జంగు, రొడ్డ రమేశ్, ఏనుగు సుధాకర్ రెడ్డి, దొంతుత తిరుపతి, యూత్ అధ్యక్షులు శ్రీరాముల పరమేశ్, దేవసల రాంచందర్, మాసు సుధాకర్, పార్వతి చంద్రయ్య, కుంటం రాజు, బాణాల సత్యనారాయణ పాల్గొన్నారు.