Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-లక్షెట్టిపేట్
విద్యకు తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు అన్నారు. ఆదివారం స్థానిక గురుకుల పాఠశాలలో 8 వ జోనల్ స్థాయి క్రీడా పోటీలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గురుకులాల్లో నాణ్యమైన విద్యను అందించాలని, ప్రతి పేద విద్యార్థి ధనవంతుల పిల్లలతో పాటు చదువుకోవాలనే ఉద్దేశంతో గురుకులాల్లో సౌకర్యాలు కల్పించారని గుర్తుచేశారు. గురుకుల విద్యార్థులు ఇప్పటికే ఎన్నో పోటీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్నారని కొనియాడారు. ప్రతి విద్యార్థి చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే దేశానికి మంచి పేరు తీసుకురావచ్చన్నారు. ప్రతి విద్యార్థి పై ప్రభుత్వం ఏటా రూ.లక్షకు పైగా ఖర్చు చేస్తోందని వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అనేక సంక్షేమ,అభివద్ధి కార్యక్రమాలు తెలంగాణలో అమలు అవుతున్నట్లు పేర్కొన్నారు. జయ శంకర్ భూపాలపల్లి, ములుగు,మంచిర్యాల,పెద్దపల్లి అసిఫాబాద్ జిల్లాల విద్యార్థులు పాల్గొనే ఈ పోటీలు మూడు రోజులు జరుగుతాయని ప్రిన్సిపాల్ లలిత కుమారి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ తిప్పని లింగన్న,మున్సిపల్ చైర్మన్ నలుమాసు కాంతయ్య, వైస్ చైర్మన్ పొడిటి శ్రీనివాస్ గౌడ్, వివిధ జిల్లాల వ్యాయామ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.