Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాగజ్నగర్రూరల్
మండలంలోని చింతగూడ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు కొమ్ము లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ఆదివారం బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సతీమణి కోనేరు రమాదేవి హాజరయ్యారు. మొదట గౌరమ్మకు పూజ చేసి బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. పాఠశాల బాలికలు, చింతగూడ కోయవాగు మహిళలు బతుకమ్మ ఆడారు. అనంతరం న్యాయనిర్ణేతలు, అతిథులు అన్ని బతుకమ్మలను పరిశీలించి మూడు ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి బహుమతులు ప్రధానం చేశారు. కోనేరు రమాదేవి మాట్లాడుతూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను అభినందించారు. బతుకమ్మ పండుగ రాష్ట్ర పండుగగా గుర్తించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. బాలికల్లో విద్యతో పాటు తెలంగాణ సాంస్కతి, సాంప్రదాయాలను ప్రచారం చేస్తూ బతుకమ్మ సంబరాలు నిర్వహించిన పాఠశాల ఉపాధ్యాయులను ఆమె అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగతి కొమరం భీం జిల్లా అధ్యక్షులు పర్ష చంద్రశేఖర్, రూరల్ ఎస్సై సోనియా, సీడీపీఓ సురేఖ, చింతగూడ కోయవాగు సర్పంచులు ఆత్రం సంజీవ్, చింతపురి లక్ష్మీ, కోయవాగు ఎంపీటీసీ అస్మా ఖాలీం, మండల పరిషత్ కో ఆప్షన్ సభ్యులు మహెబుబూ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.